NewsOrbit
తెలంగాణ‌ న్యూస్

Jana Reddy: పొలిటికల్ రిటైర్మెంట్ ప్రకటించిన జానా!సాగర్ రిజల్ట్ ఎఫెక్ట్ బాగా పడిందే!!

Jana Reddy: నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో ఓటమి పాలైన కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి ఎలక్షన్‌‌ ఫలితాలపై స్పందించారు. సాగర్ నియోజకవర్గ కాంగ్రెస్ ప్రతినిధులు, కార్యకర్తలతోపాటు తన అనుచరులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. గెలుపోటములకు అతీతంగా తనను ఆశీర్వదించిన నియోజకర్గ ప్రజలు, ఓటర్లకు కృతజ్ఞతలు చెప్పారు. తన రాజకీయ వారసులు ఎవరనేది పార్టీయే ప్రకటిస్తుందన్నారు.

Jana Reddy announces political retirement!
Jana Reddy announces political retirement

పార్టీలో కొందరు స్వప్రయోజనాల కోసం పని చేస్తున్నారని మండిపడ్డారు. ‘జానారెడ్డి అభివృద్ధి చేయలేదని చెబుతున్నారు. కానీ టీఆర్‌ఎస్ నేతలు ఏడేళ్ల కాలంలో ఏం చేశారో చెప్పాలి. లెక్కల ప్రకారం.. రాష్ట్రంలో, సాగర్‌‌లో ఏమేం చేశారో చెప్పాలి. నాకు 75 ఏళ్ల వయసు వచ్చింది. ఇకపై ఎన్నికల్లో పోటీ చేయను. పీసీసీ ఎంపికను పార్టీ అధిష్టానం చూసుకుంటుంది. ఆ విషయంలో నా అభిప్రాయాన్ని పార్టీకి చెబుతా. కరోనా టైంలో కార్యకర్తలను కలవలేకపోతున్నా. కార్యకర్తలను నా వారసులుగా తయారు చేస్తా. ఓటమి బాధ, భయం గానీ అవసరం లేదు. కరోనా పోయాక అందర్నీ కలుస్తా. గెలుపు ఓటములు సహజం. రాజకీయాలకు దూరంగా ఉండడం అనేది నా వ్యక్తిగత నిర్ణయం. ప్రభుత్వానికి నా అవసరం ఉంటే సలహా సూచనలు ఇస్తా. మా పార్టీకి అవసరం ఉంటే సలహాలు, సూచనలు ఇస్తా’ అని జానారెడ్డి పేర్కొన్నారు.

ప్రతి వాగ్దానం నెరవేరుస్తానన్న కేసీఆర్!

Cabinet Viral News: TS News Cabinet Details.. In and Out..!?

టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ కు ఆశీర్వచనమిచ్చి, భారీ మెజారిటీతో గెలిపించినందుకు నాగార్జున సాగర్ నియోజకవర్గ ప్రజలందరికీ సీఎం కేసీఆర్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.
టీఆర్ఎస్ ప్రభుత్వ విధానం ప్రకారం, ఎన్నికల సందర్భంలో ఇచ్చిన ప్రతి వాగ్ధానాన్ని నెరవేరుస్తామని సీఎం తెలిపారు. త్వరలోనే ఎమ్మెల్యే భగత్ తో వచ్చి నాగార్జున సాగర్ నియోజక వర్గం సందర్శించి ప్రజల సమస్యలన్నీ పరిష్కరిస్తామని తెలిపారు. దేవరకొండ, నాగార్జున సాగర్, మిర్యాలగూడ, హుజూర్ నగర్, కోదాడ నియోజకవర్గాల పరిధుల్లో ఇటీవల మంజూరు చేసిన లిఫ్టు ఇరిగేషన్ స్కీంలను శరవేగంగా పూర్తిచేసి ప్రజలకు నీరందిస్తామని తెలిపారు సీఎం కేసీఆర్. ఎన్నికల సందర్భంలో పార్టీ నాయకులు సేకరించిన ప్రజా సమస్యన్నింటిని కూడా వెంటనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

author avatar
Yandamuri

Related posts

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju