NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

అక్క‌డ జ‌న‌సేన టీడీపీని ఓడిస్తే… ఇక్క‌డ టీడీపీ జ‌న‌సేన‌ను ఓడిస్తుందా…!

ఏపీలో టిడిపి, జనసేన, బిజెపి పొత్తుల నేపథ్యంలో కొన్ని సీట్ల విషయంలో కీలక నేతల మధ్య సర్దుబాట్లు సెట్ అయ్యే పరిస్థితి కనపడటం లేదు. మరీ ముఖ్యంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో జనసేన అధ్యక్షులు.. నిడదవోలు కూటమి అభ్యర్థి కందుల దుర్గేష్ ను నిడదవోలులో ఓడించేందుకు టిడిపి పంతం పట్టింది. వాస్తవంగా ఆయన 2019 ఎన్నికలలో రాజమండ్రి రూరల్ సీటు నుంచి జనసేన తరఫున పోటీ చేసి ఏకంగా 42 వేల ఓట్లు దక్కించుకున్నారు. ఈ ఎన్నికలలో కూడా ఆయన రాజమండ్రి రూరల్ నుంచి జనసేన తరపున పోటీ చేయాలని అనుకున్నారు.

అయితే అక్కడ టిడిపి నుంచి సీనియర్ నేత సిట్టింగ్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఉన్నారు. తాను పోటీ నుంచి తప్పుకోనని ఇప్పటికే ప్రకటన చేశారు. చివరకు చంద్రబాబు.. పవన్ కళ్యాణ్ అనేక చర్చలు జరిపి రూరల్ సీటు బుచ్చయ్య చౌదరికి ఇచ్చి కందులు దుర్గేష్ ను ఒప్పించి బలవంతంగా నిడదవోలుకు పంపారు. నిడదవోలులో టిడిపి నుంచి గత మూడు ఎన్నికలలో వరుసగా పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు తో పాటు కుందుల సత్యనారాయణ సీట్లు ఆశించారు. అయితే ఎక్కడో రాజమండ్రి నుంచి దుర్గేష్ ను నిడదవోలు పంపడంతో స్థానిక టిడిపి కేడర్ అంతా గగ్గోలు పెడుతోంది.

దుర్గేష్ ను జనసేన అభ్యర్థిగా ప్రకటించారు. నిడదవోలు వెళ్లిన దుర్గేష్ కు టిడిపి నేతల నుంచి ఎలాంటి ఆదరణ లభించలేదు. బూరుగుపల్లి శేషారావు మద్దతు కోరేందుకు ఆయన ఇంటికి కూడా వెళ్లారు. అయితే శేషారావు ఇంట్లో ఉన్నప్పటికీ లేరని చెప్పడంతో దుర్గేష్ తీవ్ర నిరాశతో వెనుదిరిగారు. ఇక బూరుగుపల్లి శేషారావు కూడా స్థానిక టిడిపి కేడ‌ర్‌కుకు మీ ఇష్టం మీకు నచ్చినట్టు చేసుకోండి అని చెప్పడంతో పాటు పరోక్షంగా దుర్గేష్‌ను ఓడించాలని పిలుపు ఇస్తున్నట్టు టిడిపిలోనే ప్రచారం జరుగుతుంది. అంటే నిడదవోలులో టిడిపి – జనసేన అభ్యర్థి దుర్గేష్‌ను ఓడించేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది.

అయితే రాజమండ్రి రూరల్ లో జనసేన టిడిపి అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే బుచ్చ‌య్య చౌదరిని ఓడించేందుకు రంగం సిద్ధం చేసుకుంటుంది. గత ఎన్నికలలోనే ఇక్కడ మాకు 42 వేల ఓట్లు వచ్చాయి.. ఈసారి పొత్తులలో భాగంగా కచ్చితంగా జనసేన ఇక్కడ నుంచి పోటీ చేస్తే దుర్గేష్ భారీ మెజార్టీతో విజయం సాధిస్తారని అనుకున్నామని.. నాలుగేళ్లుగా దుర్గేష్ ఇక్కడ పార్టీని బలోపేతం చేసేందుకు ఎంతో కష్టపడ్డారని.. ఇప్పుడు తమ నేతకు అన్యాయం జరిగిందని స్థానిక జనసేన కేడర్ తో పాటు కాపులు వాపోతున్నారు.

వీరంతా బుచ్చ‌య్య చౌదరిని ఖచ్చితంగా తాము ఓడస్థామని శపథాలు చేస్తున్నారు. ఏది ఏమైనా రాజమండ్రి రూరల్ – నిడదవోలు నియోజకవర్గం టిడిపి జనసేన పొత్తు చిత్తు అవడంతో పాటు రాజమండ్రి రూరల్ లో టిడిపిని జనసేన.. నిడదవోలులో జనసేన ను టిడిపి ఓడించేందుకు పక్కా ప్లానింగ్ చేసుకుంటున్నట్టు తెలుస్తోంది.

Related posts

శ్రీ ఎం ఆశ్రమంలో శ్రీ గురు మహావతార్ బాబాజీ ఆలయ గ్రాండ్ ఓపెనింగ్ 

Deepak Rajula

YSRCP: తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న వైసీపీ కేంద్ర కార్యాలయం కూల్చివేత .. బాబు సర్కార్ పై జగన్ ఆగ్రహం

sharma somaraju

AP Assembly: ఏపీ శాసనసభ స్పీకర్ గా నేడు బాధ్యతలు చేపట్టనున్న అయ్యన్న .. అనూహ్య నిర్ణయం తీసుకున్న వైసీపీ..!

sharma somaraju

Salar Jung Reforms: Important Points to Remember for TGPSC Group 1 and Group 2 Exams 2024

Deepak Rajula

YS Jagan: ఓటమితో అధైర్యపడవద్దు – క్యాడర్ కు తోడుగా నిలిచి భరోసా ఇవ్వండి: వైసీపీ నేతలకు జగన్ సూచన  

sharma somaraju

Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు .. ఇకపై కొత్త చంద్రబాబును చూస్తారంటూ..

sharma somaraju

Chirajeevi – Pawan Kalyan: చిరు ఇంటికి పవన్ .. ‘మెగా’ సంబురం

sharma somaraju

ఏపీ గవర్నర్ కు ఎన్నికైన ఎమ్మెల్యే జాబితాను అందజేసిన సీఈవో .. గెజిట్ నోటిఫికేషన్ విడుదల

sharma somaraju

Modi – Pawan Kalyan: కుటుంబ సమేతంగా మోడీని కలిసిన పవన్ కళ్యాణ్

sharma somaraju

ప్రధాని మోదీ పరిస్థితిపై కాంగ్రెస్ వ్యంగ్య చిత్రం .. సోషల్ మీడియాలో వైరల్

sharma somaraju

Manamey: మ‌న‌మే మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్‌.. హిట్ కొట్టాలంటే శ‌ర్వానంద్ ఎంత రాబట్టాలి..?

kavya N

Kajal Aggarwal: కాజ‌ల్ చేతికి ఉన్న ఆ వాచ్ ఖ‌రీదెంతో తెలుసా.. ఓ కారు కొనేయొచ్చు!

kavya N

NTR – Anushka: ఎన్టీఆర్‌, అనుష్క కాంబినేష‌న్ లో మిస్ అయిన మూడు క్రేజీ చిత్రాలు ఏవో తెలుసా?

kavya N

YS Jagan: రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయి: వైఎస్ జగన్

sharma somaraju

Rashmika Mandanna: ఎన్టీఆర్ సినిమాకు ర‌ష్మిక షాకింగ్ కండీష‌న్స్‌.. కొంచెం ఓవర్ అయినట్లు ఉంది కదా..?

kavya N