NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

విశాఖ‌లో టాప్ సీట్లు లేపేసిన జ‌న‌సేన‌… పక్కా గెలిచే సీట్ల‌న్నీ ప‌ట్టేసిన ప‌వ‌న్‌…!

వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప‌క్కా వ్యూహంతో ముందుకు సాగాల‌ని నిర్ణ‌యించుకున్న జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. ఆదిశ‌గా అడుగులు వేస్తున్నారు. టీడీపీతో పొత్తు పెట్టుకుని.. దీనిని కార్య‌క‌ర్త‌ల‌కు వివ‌రిస్తున్నారు. ఇదే స‌మ‌యంలో ఆయ‌న టికెట్ల వ్య‌వ‌హారాన‌ని కూడా సీరియ‌స్గా తీసుకున్నారు. తాజాగా ఆయ‌న విశాఖ‌లో నాలుగు స్థానాల‌కు అభ్య‌ర్థుల‌ను ఖ‌రారు చేసిన‌ట్టు స‌మాచారం. ఇదే విష‌యంపై పార్టీలోనూ చ‌ర్చ సాగుతోంది. తాజాగా రెండు రోజుల కింద‌ట విశాఖ‌లో ప‌ర్య‌టించిన ప‌వ‌న్‌.. ఎన్నికల్లో పోటీ చేయబోయే స్థానాలు, పొత్తులపై నాయకులతో చర్చించారు.

ఈ సమావేశంలోనే ఉత్తరాంధ్రలో పార్టీ పోటీ చేయబోయే స్థానాలపై నాయకులకు కీల‌క‌ సమాచారాన్ని అందించినట్టు తెలిసింది. విశాఖ జిల్లాలో పోటీ చేయబోయే స్థానాలు, అక్కడ పోటీ చేయనున్న అభ్యర్థులకు పవన్ న‌ర్మ‌గ‌ర్భంగా చెప్పినట్టు స‌మాచారం.. అందుకు అనుగుణంగానే ఇన్‌చార్జ్‌లను ఆయా నియోజకవర్గాలకు పవన్‌ కల్యాణ్‌ నియమించాలని తొలుత భావించారు. పొత్తులో ఉండడం వల్ల ఇతర పార్టీలతో ఇబ్బందులు, అక్కడ ఆయా పార్టీలు నేతలు ఎలా స్పందిస్తారన్న సందేహాలు నెలకొన్న సమయంలో ఆ నిర్ణయాన్ని విర‌మించుకున్న‌ట్టు తెలిసింది.

విశాఖ జిల్లాలో జనసేన 4 స్థానాల్లో పోటీ చేసే అవకాశముందని విశ్వ‌స‌నీయ వ‌ర్గాలు తెలిపాయి. వీటిలో గాజువాక, పెందుర్తి, భీమిలి, యలమంచిలి స్థానాలు ఉన్నాయ‌ని తెలిసింది. ఈ స్థానాలకు ఇన్‌చార్జ్‌లను నియమించాలని భావించారు. భీమిలికి వంశీ కృష్ణ శ్రీనివాస్‌ యాదవ్‌, గాజువాకకు సుందరపు సతీష్‌ కుమార్‌, యలమంచిలికి సుందరపు విజయ్‌ కుమార్‌, పెందుర్తికి పంచకర్ల రమేష్‌బాబును నియమించాలని భావించారు. కానీ, పొత్తుపై ప్రభావం ఉంటుందన్న ఉద్ధేశంతో వెనక్కి తగ్గారు. అయితే.. ఈ నాలుగు స్థానాలు త‌మ‌వేన‌ని.. ఈమేర‌కు ప‌వ‌న్ హామీ ఇచ్చిన‌ట్టు పార్టీ నేత‌లు వ్యాఖ్యానిస్తున్నారు.

ఇక‌, పార్టీ కీల‌క నేత‌, పవ‌న్ సోద‌రుడు నాగ‌బాబుకు అనకాపల్లి పార్లమెంట్‌ స్థానాన్ని రిజ‌ర్వ్ చేసుకున్న‌ట్టు తెలుస్తోంది. ఇప్పటి కే నాగబాబు అనకాపల్లి పార్లమెంట్‌ స్థానం పరిధిలో తిష్ఠ‌వేశారు. ఇటీవ‌ల జిల్లాలో పర్యటించిన నాగంద్రేబాబు ఆయా నియోజకవర్గాలకు చెందిన నేతలతోనూ సమావేశమయ్యారు. తన మనసులోని మాటను సన్నిహితులు వద్ద చెప్పడంతోపాటు ఆ దిశగా క్షేత్రస్థాయిలో పని చేయాలని సూచించినట్టు తెలిసింది. ఇదిలావుంటే.. పొత్తులో భాగంగా టీడీపీ కూడా.. రెండు పార్ల‌మెంటు స్థానాల‌ను జ‌న‌సేన‌కు ఇవ్వ‌నున్న‌ట్టు తెలుస్తోంది. వీటిలో మ‌చిలీప‌ట్నం, అన‌కాప‌ల్లి ఉన్నాయ‌ని తెలుస్తోంది.

author avatar
BSV Newsorbit Politics Desk

Related posts

AP Elections 2024: మరో 38 మంది అభ్యర్ధులను ప్రకటించిన కాంగ్రెస్

sharma somaraju

Rashmika Mandanna: సాయి పల్లవి దయతో స్టార్ హీరోయిన్ అయిన రష్మిక.. నేషనల్ క్రష్ కు న్యాచురల్ బ్యూటీ చేసిన సాయం ఏంటి?

kavya N

Raj Tarun: పెళ్లిపై బిగ్ బాంబ్ పేల్చిన రాజ్ త‌రుణ్‌.. జీవితాంతం ఇక అంతేనా గురూ..?

kavya N

Nara Brahmani: అమ్మ దీనమ్మ.. కాలేజ్ టైంలో నారా బ్రాహ్మణి అటువంటి పనులు చేసేదా.. పాప మంచి గడుసరిదే..!

Saranya Koduri

Hello Brother: 30 ఏళ్ళు పూర్తి చేసుకున్న హ‌లో బ్ర‌ద‌ర్.. అప్పట్లో ఈ సినిమా ఎన్ని కోట్లు రాబ‌ట్టిందో తెలుసా?

kavya N

AP SSC Results: ఏపీలో టెన్త్ ఫలితాలు వచ్చేశాయోచ్ .. పార్వతీపురం మన్యం ఫస్ట్ .. కర్నూల్ లాస్ట్.. రిజల్ట్స్ ఇలా తెలుసుకోండి

sharma somaraju

Sreeja Konidela: గుడ్‌న్యూస్ చెప్పిన చిరంజీవి చిన్న కూతురు.. మొద‌లైన శ్రీ‌జ కొత్త ప్ర‌యాణం!

kavya N

Thiruveer: సైలెంట్ గా పెళ్లి పీట‌లెక్కేసిన మసూద న‌టుడు.. అమ్మాయి ఎంత అందంగా ఉందో చూశారా?

kavya N

Maldives Parliamentary Elections: మాల్దీవుల పార్లమెంటరీ ఎన్నికల్లో ముయిజ్జు పార్టీ హవా

sharma somaraju

Lok Sabha Elections 2024: భారీ భద్రత నడుమ మణిపూర్ లో కొనసాగుతున్న రీపోలింగ్

sharma somaraju

కిష‌న్‌రెడ్డిని ద‌గ్గ‌రుండి మ‌రీ గెలిపిస్తోన్న కేసీఆర్, రేవంత్‌..!

2019కు రివ‌ర్స్‌లో… గ్రేట‌ర్ హైద‌రాబాద్‌లో ఆ నాలుగు ఎంపీ సీట్ల ఫ‌లితాలు…!

రాజమండ్రి సిటీలో వైసీపీ భ‌ర‌త్ Vs టీడీపీ వాసు… హీరో ఎవరో తేలిపోయిన‌ట్టే…?

రాజమండ్రి రూరల్ రిపోర్ట్‌: ‘ టీడీపీ బుచ్చయ్య ‘ గెలుస్తాడా…?

Congress: ఏపీలో మరో 9మందితో కాంగ్రెస్ లోక్ సభ అభ్యర్ధుల ప్రకటన

sharma somaraju