18.2 C
Hyderabad
February 9, 2023
NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

Pawan Kalyan: ఏపీ, తెలంగాణ రాజకీయాలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు .. తెలంగాణలో ఎన్ని స్థానాల్లో చెప్పేసిన జనసేనాని

Share

Pawan Kalyan:  జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపి, తెలంగాణ రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. తన ఎన్నికల ప్రచార వాహనం వారాహికి మంగళవారం కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతం తాను బీజేపీతో కలిసే ఉన్నానని, ఆ పార్టీతో పొత్తు కొనసాగుతుందని స్పష్టం చేశారు. అయితే ఎవరు కలిసి వచ్చినా, రాకపోయినా ముందుకు వెళ్తామని తెలిపారు. పొత్తుల అంశం ఎన్నికలకు ముందు మాట్లాడవచ్చని చెప్పారు.

Pawan Kalyan

 

కొత్త పొత్తులు కుదిరితే కొత్తగా వెళ్తామనీ, లేకపోతే ఒంటరిగా పోరుకు కూడా సిద్దమని పవన్ అన్నారు. ఏపిలో ప్రతిపక్ష పార్టీలు అన్నీ కలిసి పోటీ చేాయాలనేది తన అభిమతమని చెప్పుకొచ్చారు పవన్ కళ్యాణ్. బీజేపీ కలిసి వచ్చేలా ప్రయత్నాలు చేస్తాననీ, కలిసి రాకపోతే వేరే పార్టీల వైపు చూడాల్సి వస్తుందన్నారు. పొత్తులపై ఎన్నికలకు వారం ముందు క్లారిటీ వస్తుందన్నారు. 2014 కాంబినేషన్ పై కాలమే నిర్ణయిస్తుందని అన్నారు. బీజేపీకి దూరమై టీడీపీతో జనసేన జతకడుతోందని ప్రచారం జరుగుతున్న తరుణంలో పవన్ కళ్యాణ్ ఈ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

Pawan Kalyan

మరో పక్క కేసిఆర్ బీఆర్ఎస్ జాతీయ పార్టీ పెట్టడాన్ని స్వాగతిస్తున్నామని తెలిపారు. తెలంగాణ తనకు పునర్జన్మ ఇచ్చిన నేల అని, తెలంగాణలో తమ పార్టీ పాత్ర పరిమితమేనని చెప్పారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో నెలకొన్న సమస్యలు వేర్వేరని, రెండింటినీ పోల్చి చూడలేమని అన్నారు పవన్ కళ్యాణ్. తెలంగాణలో పరిమితులతో ఆట ఆడతామన్నారు. తెలంగాణలో ఖచ్చితంగా పర్యటిస్తానని చెప్పారు. కొద్ది మంది అయినా అసెంబ్లీలోకి అడుగు పెట్టాలన్నారు. యువత నుండి మంచి లీడర్లను వెతుకున్నానని తెలిపారు. 25 నుండి 40 అసెంబ్లీ స్థానాల్లో, 7 నుండి 14 పార్లమెంట్ స్థానాల్లో జనసేన అభ్యర్ధులను బరిలో నిలపాలన్న యోచన చేస్తున్నట్లు చెప్పారు. ఎవరైనా పొత్తుల కోసం వస్తే ఆలోచిస్తామని పవన్ కళ్యాణ్ తెలిపారు.

YS Viveka Murder Case: సీబీఐ విచారణకు సహకరిస్తా .. కానీ

Pawan Kalyan

Share

Related posts

Prabhas : “ఇంటికి వచ్చి మరీ కొడతా రా ఒరేయ్” ప్రభాస్ ఫ్యాన్ కి రాధేశ్యామ్ డైరెక్టర్ స్వీట్ వార్నింగ్ !

Ram

F 3 – Major: ఒకే రోజు రెండు సినిమాలు దేనికదే..పోటీ ఉండదంటున్న మేకర్స్..

GRK

Bigg Boss 5 Telugu: కంటెస్టెంట్ సిరి కి ఊహించని షాక్ ఇచ్చిన షణ్ముఖ్ జస్వంత్..!!

sekhar