NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

Janasena: మళ్లీ విడాకులు ఇవ్వబోతున్న పవన్ కళ్యాణ్..??

Janasena: రాజకీయాల్లో శాశ్వత మిత్రులు ఉండరు, శాశ్వత శత్రువులు ఉండరు అనేది అందరికీ తెలిసిందే. నాయకులు ఒక పార్టీ నుండి గెలిచి మరొక పార్టీలో చేరడం, అంతకు ముందు విమర్శించుకున్న నాయకులతోనే కలసి వేదికలు పంచుకోవడం, కలిసి ప్రయాణం చేయడం చూస్తూనే ఉన్నాం. అదే విధంగా రాజకీయ పార్టీలు కూడా వారి అవసరాల మేరకు జత కట్టడం, విడిపోవడం రివాజుగా మారింది. టీడీపీ గతంలో బీజేపీతో పొత్తు పెట్టుకుంది. బీజేపీ మతతత్వపార్టీ అంటూ విమర్శలు చేసింది. ఆ తరువాత 2014 ఎన్నికలకు ముందు మళ్లీ కలిసింది. 2019 ఎన్నికలకు ముందు దోస్తాన్ కటీఫ్ చేసుకుంది. అదే విధంగా వామపక్షాలతోనూ టీడీపీ అదే తీరు ప్రదర్శించింది. అందుకే చంద్రబాబు నాయుడుని ఉద్దేశించి సీపీఐ నారాయణ ఆయనకు ముద్దు వచ్చినప్పుడు చంకనెత్తుకుంటారు. ఆ తరువాత విసిరేస్తాడు అన్నట్లుగా కామెంట్స్ చేశారు. ఇప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీరు అదేలా ఉంది.

Janasena likely quit with bjp
Janasena likely quit with bjp

Janasena: తొలుత బీజేపీ, టీడీపీతో..

తొలుత బీజేపీ, టీడీపీతో ఉమ్మడిగా జనసేన సావాసం చేసింది. ఆ తరువాత విడిపోయి వామపక్షాలు, బీఎస్పీతో కలిసింది. ఆ తరువాత మళ్లీ బీజేపీతో జత కట్టారు పవన్ కళ్యాణ్. రాష్ట్రంలో ప్రజా సమస్యలపై జనసేన, బీజేపీ ఉమ్మడి కార్యక్రమాలు చేస్తామని గతంలో ప్రకటించారే గానీ ఆ విధంగా కార్యాచరణకు పూనుకున్నది లేదు. ఏపిలో బీజేపీతో పొత్తుకు క్షేత్ర స్థాయి జనసైనికులే సుముఖంగా లేరన్న టాక్ నడుస్తోంది. తిరుపతి ఉప ఎన్నికలకు ముందే జనసేన – బీజేపీకి మధ్య కొంత గ్యాప్ వచ్చినట్లు ప్రచారం జరిగింది. ఆ తరువాత నాయకులు మాట్లాడుకోవడంతో వివాదం సద్దుమణిగింది. బద్వేల్ ఉప ఎన్నికల విషయానికి వచ్చే సరికి బీజేపీతో సంప్రదించకుండానే జనసేన పోటీ చేయడం లేదని పవన్ కళ్యాణ్ చెప్పేశారు.

Janasena: ఇరుపార్టీల పొత్తు ఉన్నా..

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పవన్ కళ్యాణ్ గళం విప్పారు. అక్కడి కార్మికులకు సంఘీభావం తెలిపారు. రాష్ట్రంలో ఇరుపార్టీల మధ్య పొత్తు ఉన్నప్పటికీ చాలా కాలంగా బీజేపీ – జనసేన ఎవరికి వారే కార్యక్రమాలు చేసుకుంటూ వెళుతున్నారు. అయితే ఇప్పుడు జనసేన పూర్తిగా బీజేపీ నుండి పక్కకు జరగాలని డిసైడ్ అయ్యారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తెలంగాణలో బీజేపీ – టీఆర్ఎస్ ల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉంది. టీఆర్ఎస్, బీజేపీల మధ్య తీవ్ర స్థాయిలో మాటల యుద్ధం, నేతల అరెస్టుల వరకూ వెళ్లింది. కేసిఆర్ ఏకంగా జాతీయ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తూ మోడీపైనే వార్ డిక్లేర్ చేశారు. కేంద్రం నుండి బీజేపీని తరిమివేయాల్సిందేనని ప్రకటించారు.

Janasena: కేటిఆర్ తో పవన్

ఈ పరిస్థితుల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన మువీ భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటిఆర్, మరో మంత్రి తలసాని శ్రీనివాస్ లను ఆహ్వానించడం బీజేపీ నేతలకు రుచించడం లేదు. దానికి తోడు పవన్ అభిమానులు ఏపిలో భీమ్లా నాయక్ సినిమా రిలీజ్ సందర్బంగా కేసిఆర్ ఫోటోతో ఫ్లెక్సీ ఏర్పాటు చేయడం పుండుమీద కారం చల్లినట్లు అయ్యింది. భీమ్లానాయక్ సినిమా విడుదల సందర్భంలో ఏపిలో రాజుకున్న వివాదంపై టీడీపీతో సహా ఇతర పక్షాలు మాట్లాడినా జనసేనతో పొత్తులో ఉన్న బీజేపీ నేతలు మాత్రం మాట్లాడలేదు. ఈ పరిణామాలు అన్నీ గమనిస్తుంటే బీజేపీతో మళ్లీ జనసేన విడాకులకు రెడీ అయిందనే అంటున్నారు. చూడాలి ఏమి జరుగుతుందో.

author avatar
sharma somaraju Content Editor

Related posts

Love Guru OTT: ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు వచ్చేస్తున్న విజయ్ ఆంటోనీ ” లవ్ గురు “.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Doordarshan: డీడీ న్యూస్ లోగో రంగు మార్పుపై రేగుతున్న దుమారం

sharma somaraju

Divya Khosla Kumar: చేసింది 5 సినిమాలు.. కానీ ఇప్పుడు ఇండియాలోనే రిచ్చెస్ట్ హీరోయిన్‌!!

kavya N

Tollywood Actresses: ఈ ఫోటోలో ఉన్న చిన్నారులు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్లు.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా..?

kavya N

Iran – Israel: ఇజ్రాయెల్ సర్కార్‌ను హెచ్చరిస్తూ ఇరాన్ విదేశాంగ మంత్రి కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Premalu: థియేట‌ర్స్ లో సూప‌ర్ హిట్‌.. ఓటీటీలో అట్ట‌ర్ ఫ్లాప్‌.. ప్రేమలు మూవీ కొంప ముంచింది అదేనా..?

kavya N

Elon Musk: టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ భారత్ పర్యటన వాయిదా ..మళ్లీ ఎప్పుడంటే..?

sharma somaraju

Samantha: స‌మంత చేతికి ఉన్న ఆ డైమండ్ వాచ్ ధ‌రెంతో తెలుసా.. ఒక ఇంటినే కొనేయొచ్చు!!

kavya N

YS Sharmila: కడపలో నామినేషన్ లో దాఖలు చేసిన వైఎస్ షర్మిల

sharma somaraju

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?