Janasena Party: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాబోయే ఎన్నికల్లో ఎక్కడ నుండి పోటీ చేయనున్నారు..? 2019 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గాజువాక, భీమవరం రెండు స్థానాల నుండి పోటీ చేశారు. రెండు చోట్ల రెండవ స్థానంలో ఉన్నారు. ఓడిపోయారు. నిజానికి గాజువాక పవన్ కళ్యాణ్ గెలవాల్సిన స్థానం. ఎందుకంటే 2019 ఎన్నికలకు ముందు రాష్ట్ర వ్యాప్తంగా సభ్యత్వ నమోదులో గాజువాక ప్రధమ స్థానంలో ఉంది. అత్యధికంగా గాజువాకలో 95వేలు సభ్యత్వ నమోదు అయ్యింది. ఈజీగా 25వేల మెజార్టీతో గెలవాల్సి ఉండగా అక్కడ పవన్ కళ్యాణ్ ఓటిపోయారు. పెద్ద సంఖ్యలో యువత, ప్రజలు ఆయన పట్ల అభిమానంతో ఆకర్షణగా ఉన్నప్పటికీ ఓట్లు వేయడం లేదు. అదే జనసేనకు లోపంగా కనబడుతోంది. అయితే రాబోయే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఎక్కడ నుండి పోటీ చేయనున్నారు.? అనే దానిపై ఊహగానాలు సాగుతున్నాయి. గాజువాక, భీమవరం, తాడేపల్లిగూడెం, కాకినాడ, తిరుపతి ఈ అయిదు స్థానాల్లో ఎక్కడ నుండి పోటీ చేయనున్నారు..? అనేది జనసేన వర్గాలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో ఓ చర్చ జరుగుతోంది.
కాకినాడ నుండి పోటీ చేస్తే బాగుంటుంది. అక్కడ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిపై ప్రతీకారం తీర్చుకున్నట్లు ఉంటుంది. ఆయన జనసేనను బాగా టార్గెట్ చేస్తున్నారు అన్న భావన ఆ పార్టీలో ఉంది. కాకినాడ నుండి పవన్ పోటీ చేయాలని అక్కడి జనసేన శ్రేణులు కోరుకుంటున్నారు. మరో పక్క ఆయన తాడేపల్లిగూడెం నుండి పోటీ చేస్తే బాగుంటుందని పశ్చిమ గోదావరి జిల్లా జనసేన నేతలు భావిస్తున్నారు. మరి కొంత మంది ఓడిన చోటే నెగ్గాలని గత నియోజకవర్గాల నుండే పోటీ చేయాలని అనుకుంటున్నారు. అయితే రీసెంట్ గా తిరుపతి ప్రాంతానికి చెందిన జనసేన కార్యకర్తలు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి పవన్ కళ్యాణ్ ఇక్కడ నుండి పోటీ చేస్తే లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపిస్తామని పేర్కొన్నారు. వాళ్ల ఆత్మవిశ్వాసాన్ని అభినందించాల్సిందే కానీ అంత మెజార్టీ సాధ్యమేనా..? లక్ష మెజార్టీ రావడం కలే. 50వేల మెజార్టీ అయినా సాధ్యమేనా..? అనేది పరిశీలిస్తే..
1983 టీడీపీ ఆవిర్భావం నుండి అయిదు సార్లు టీడీపీ గెలిచింది. అందులో ఒక ఉప ఎన్నిక. 1983లో ఎన్టీఆర్ విజయం సాధించగా, 83, 85 లో టీడీపీ ఓడిపోయింది. 94లో ఏ మోహన్, 1999లో చదలవాడ కృష్ణమూర్తి, 2014లో మున్నూరు వెంకట రమణ టీడీపీ తరపున గెలిచారు. 2015 ఉప ఎన్నికల్లో సుగుణమ్మ గెలిచారు. 2019 వరకూ సుగుణమ్మ ఎమ్మెల్యే గా ఉన్నారు. 2019 ఎన్నికల్లో చాలా తక్కువ మెజార్టీతో సుగుణమ్మ ఓడిపోయారు. వైసీపీ అభ్యర్ధి భూమన కరుణాకర్ రెడ్డికి 80,544 ఓట్లు వస్తే, సుగుణమ్మకు 79,836 ఓట్లు వచ్చాయి. జనసేన అభ్యర్ధి చదలవాడ కృష్ణమూర్తికి 12,315 ఓట్లు వచ్చాయి. కేవలం సుమారు 700 ఓట్ల తేడాతో సుగుణమ్మ ఓడిపోయారు. ఇక ఈ నియోజకవర్గంలో సామాజిక సమీకరణాలు పరిశీలిస్తే..ఈ నియోజకవర్గంలో 2లక్షల 81వేల ఓట్లు ఉన్నాయి. ఇందులో బలిజ సామాజికవర్గ ఓట్లు ఎక్కువగా ఉంటాయి. ఈ సామాజక వర్గ ఓట్లు 60 నుండి 70 వేల ఓట్లు ఉన్నాయి. ఆ తరువాత రెడ్డి, యాదవ, తమిళనాడు నుండి వలస వచ్చిన ఓటర్లు, ఎస్సీలు 30వేలు, ఎస్టీలు 8వేలు, ఇతర బీసీ ఓటర్లు ఉంటారు. సామాజికవర్గ ఓట్ల బలం చూసుకునే పవన్ కళ్యాణ్ ను లక్ష ఓట్ల మెజార్టీ తో గెలిపిస్తామని ఆ పార్టీ శ్రేణులు అంటున్నారు.
ఇక్కడ ఉన్న 2లక్షల 80వేల ఓట్లలో 2లక్షల 40వేల వరకూ పోల్ అయ్యే అవకాశం ఉంటుంది. పవన్ కళ్యాణ్ కు లక్ష మెజార్టీ రావాలంటే ఇతర రాజకీయ పక్షాలు మొత్తానికి 70వేల ఓట్లకు మించి రాకూడదు. పవన్ కళ్యాణ్ కు లక్షా 70వేల ఓట్లు వస్తే అప్పుడు లక్ష మెజార్టీ సాధ్యపడుతుంది. ఇన్ని ఓట్లు వచ్చే అవకాశం ఉందా..? లేదా అనేది పరిశీలిస్తే.. బలిజ సామాజికవర్గంలో 80 శాతం ఓట్లు పడతాయని వాళ్లు భావిస్తే 60వేల వరకూ వచ్చే అవకాశం ఉంటుంది. నియోజకవర్గంలో రెడ్డి, ఎస్సీ, ఎస్టీ సామాజికవర్గంతో పాటు కొన్ని బీసీ వర్గాలు వైసీపీకి అనుకూలంగా ఉన్నారు. కమ్యూనిటీ ప్రేమ ఉన్నట్లయితే మాజీ ఎమ్మెల్యే చదలవాడ కృష్ణమూర్తికి 2019 ఎన్నికల్లో అంత తక్కువగా ఓట్లు వచ్చేవి కావు. ఆయనకు కేవలం 12,315 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఆ సామాజికవర్గం మీద ప్రేమ ఉన్నట్లయితే చదలవాడకు కనీసం 40వేల ఓట్లు రావాలి. కానీ రాలేదు. ఇక 2009లో అప్పటి పీఆర్పీ నేత, మెగాస్టార్ చిరంజీవికి వచ్చిన మెజార్టీ చూస్తే కేవలం 16వేల మెజార్టీ మాత్రమే. చిరంజీవికి 56,316 ఓట్లు రాగా భూమన కరుణాకర్ రెడ్డికి 40వేల ఓట్లు వచ్చాయి. ఈ లెక్కల ప్రకారం చూసుకుంటూ సామాజికవర్గం మొత్తం గట్టిగా పని చేస్తే పవన్ కళ్యాణ్ 30 నుండి 35వేల మెజార్టీతో గెలిచే అవకాశాలు ఉంటాయి. ఇది కూడా సామాజికవర్గం, కార్యకర్తలు అంకితభావంతో పని చేస్తే సాధ్యం అవుతుంది.
రాజకీయ చైతన్యం ఉన్న ఈ నియోజకవర్గంలో వివిధ కులాలకు చెందిన ఎమ్మెల్యేలుగా ఎన్నికైయ్యారు. కమ్మ (ఎన్టీఆర్), బలిజ, రెడ్డి, బీసీ వర్గాలకు చెందిన వారు ఎమ్మెల్యేలుగా గెలిచారు. ఇక్కడ సామాజిక చైతన్యం ఎక్కువ కాబట్టి గంపగుత్తగా సామాజిక వర్గ ఓట్లు పడే అవకాశం లేదు అని మాత్రం చెప్పవచ్చు. లక్ష ఓట్లు అంటూ ఆకాశానికి నిచ్చెన వేయకుండా 30 నుండి 35వేల మెజార్టీ తెస్తామని జనసైనికులు పేర్కొంటే బాగుంటుంది. ఇది పొత్తు లేకుండా పోటీ చేస్తే. అదే పొత్తు ఉంటే మరో 15 నుండి 20వేల ఓట్ల మెజార్టీ పెరిగే అవకాశం ఉంటుంది. ఇది తిరుపతికి సంబంధించి గ్రౌండ్ రిపోర్టు.
Ravi Teja: మాస్ మహారాజా రవితేజ హీరోగా వస్తున్న యాక్షన్ థ్రిల్లర్ రామారావు ఆన్ డ్యూటీ. ఈ మూవీ జూలై…
Rakul Preet Singh: ప్రముఖ సినీ నటి రకుల్ ప్రీత్ సింగ్ తెలుగులో సినిమాలు నటించడం చాలావరకు తగ్గించింది. బాలీవుడ్పైనే…
Dil Raju: టాలీవుడ్(Tollywood) ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ నిర్మాతలలో దిల్ రాజు(Dil Raju) ఒకరు. తన బ్యానర్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్…
Today Horoscope: జూలై 5 - అషాడమాసం - మంగళవారం మేషం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రులతో…
Samantha Tapsee: హీరోయిన్ తాప్సి(Tapsee) అందరికీ సుపరిచితురాలే. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు(Raghavendra Rao) దర్శకత్వంలో మంచు మనోజ్(Manoj) హీరోగా నటించిన "ఝుమ్మంది…
God Father: మలయాళంలో మోహన్ లాల్(Mohan Lal) ప్రధాన పాత్రలో నటించిన "లూసిఫర్"(Lucifer) తెలుగులో "గాడ్ ఫాదర్"(God Father)గా తెరకెక్కుతోంది.…