లేడీ గెటప్ వేసి జానీ మాస్టర్ వేసిన స్టెప్పులు చూస్తే దిమ్మతిరిగిపోవాల్సిందే..!

jani master performance in lady getup in dasara event
Share

జానీ మాస్టర్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. డౌన్ టూ ఎర్త్ అంటే ఏంటో ఆయన్ను చూసి తెలుసుకోవచ్చు. తెలుగులో పెద్ద కొరియోగ్రాఫర్. కానీ.. ఎంతో సింపుల్ గా ఉంటాడు జానీ మాస్టర్.

పెద్ద పెద్ద హీరోలతో స్టెప్పులేయించే జానీ మాస్టర్.. గత కొన్ని రోజుల నుంచి టీవీ షోలలోనూ పాల్గొంటున్నారు. డ్యాన్స్ షోలతో పాటు కామెడీ షోలకు జడ్జిగా వ్యవహరిస్తున్నారు.

jani master performance in lady getup in dasara event
jani master performance in lady getup in dasara event

అయితే.. జీ తెలుగులో దసరా సందర్భంగా ఓ ఈవెంట్ ను ప్లాన్ చేశారు. చి. ప్రదీప్ కు చి.ల.సౌ శ్రీముఖి నమస్కరించి వ్రాయునది.. అనే టైటిల్ తో ఓ ఈవెంట్ ను దసరాకు తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

ఈ ఈవెంట్ లో నాగబాబుతో పాటు.. ఆయన కూతురు నిహారిక, జీ తెలుగు బొమ్మ అదిరింది కమెడియన్లు వచ్చి సందడి చేశారు. యాంకర్లుగా ప్రదీప్, శ్రీముఖి వ్యవహరించారు.

ఇప్పటికే ఈ ఈవెంట్ కు సంబందించిన కొన్ని ప్రోమోలను విడుదల చేసిన జీ తెలుగు.. తాజాగా జానీ మాస్టర్ లేడీ గెటప్ వేసుకొని చేసే పర్ ఫార్మెన్స్ కు సంబంధించిన ప్రోమోను విడుదల చేసింది.

లేడీ గెటప్ వేసుకోవడానికి రెండు మూడు గంటల సమయం పట్టిందని.. నిజంగా లేడీస్ అంత భారీ కాస్ట్యూమ్స్ ధరించి అద్భుతంగా డ్యాన్స్ చేస్తారన్న విషయం ఇవాళ తాను లేడీ గెటప్ వేసుకుంటే తెలిసిందని జానీ మాస్టర్ చెప్పుకొచ్చేసరికి.. సెట్ అందరూ ఆయనకు చప్పట్లు కొట్టారు.

దానికి సంబంధించిన ప్రోమోను మీరు కూడా చూసేయండి మరి..
https://www.youtube.com/watch?v=4EPj9J5n5Cw


Share

Related posts

దుబ్బాకలో బీజేపీ అభ్యర్ధికి చుక్కలు చూపిస్తున్న పోలీసులు..!!

Special Bureau

దుబ్బాక రిజల్ట్ ఎఫెక్ట్ ప్రజలలోకి కేసిఆర్..??

sekhar

జగన్ చుట్టూ ఉన్న ‘ వాళ్ళు ‘ చాలా పెద్ద డ్యామేజ్ చేస్తున్నారు ? 

sekhar