న్యూస్ సినిమా

Karan johar : కరణ్ జోహర్ తో మరో సినిమా చేయబోతున్న జాన్వీ కపూర్

Share

Karan johar : అందాల తార, అతిలోక సుందరి సీనియర్ స్టార్ హీరోయిన్ అయిన శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ బాలీవుడ్ లో ఇప్పుడు స్టార్ హీరోయిన్ గా వెలుగుతోంది. శ్రీదేవి నటవారసురాలుగా జాన్వీ ప్రముఖ ఫిల్ మేకర్స్ కరణ్ జోహార్ సంస్థ ధర్మ ప్రొడక్షన్స్ నిర్మించిన ‘ధడక్’ మూవీతో హిందీ సీమలో ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. మొదటి సినిమా నుంచే జాన్వీ బాలీవుడ్ లో వరుస సినిమాల లైనప్ తో ఫుల్ బిజీగా గడుపుతోంది. ఇక జాన్వీ కెరీర్ ప్రారంభం నుంచి ధర్మ ప్రొడక్షన్స్ లోనే ఎక్కువగా సినిమాలను చేస్తూ వస్తోంది. ‘ధడక్’ తర్వాత కూడా జాన్వీ వరుసగా పలు హిట్ సినిమాలలో నటించింది.

janvi kapoor is going to do another movie with karan-johar
janvi kapoor is going to do another movie with karan-johar

రీసెంట్ గా జాన్వీ రూహీ మూవీతో వచ్చి ఆకట్టుకుంది. ఇక ఈమె ప్రస్తుతం ధర్మ ప్రొడక్షన్స్ లో నిర్మిస్తున్న ‘దోస్తానా’ సీక్వెల్ సినిమా ‘దోస్తానా-2’ షూటింగ్ లో బిజీగా ఉంది. అయితే కరోనా కారణం అలాగే కొన్ని అనివార్య కారణాల వల్ల దోస్తానా-2 మూవీని రీషూట్ చేస్తున్నారట. కాగా జాన్వీ వరుసగా ప్రాజెక్ట్స్ కమిటవుతున్న క్రమంలోనే తాజాగా మరో సినిమాకు ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్ లో చేయడానికి సంతకం చేసిందని లేటెస్ట్ అప్‌డేట్. విశేషం ఏమిటంటే ఈ సినిమాకి బాలీవుడ్ ప్రముఖ నటుడు బోమన్ ఇరానీ
కొడుకు కయోజ్ ఇరానీ దర్శకత్వం వహిస్తు ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నాడు.

Karan johar : జాన్వీ కపూర్ త్వరలో టాలీవుడ్ లో కూడా ఎంట్రీ ఇవ్వనున్నట్టు వార్తలు వస్తున్నాయి.

కరణ్ జోహర్ బోమన్ వారసుడు ని పరిచయం చేస్తుండటం ఇప్పుడు బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. కయోజ్ ట్యాలెంట్ ని గుర్తించిన కరణ్ ఆయనకి డైరెక్షన్ చేసే అవకాశం ఇచ్చినట్లు సమాచారం. కరణ్ జోహర్ ఇంతకముందు నిర్మించిన హిట్ మూవీ స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ సినిమాతో కయోజ్ నటుడుగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత కయోజ్ దర్శకత్వం వైపు దృష్టి సారించాడు. ఒకవైపు జాన్వీ..మరొకవైపు కయోజ్ బాధ్యతల్ని కరణ్ తీసుకుని స్టార్ కిడ్స్ కి రియల్ గాడ్ ఫాదర్ గా మారారు. చూడాలి మరి ఈ
మూవీ ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో. కాగా జాన్వీ కపూర్ త్వరలో టాలీవుడ్ లో కూడా ఎంట్రీ ఇవ్వనున్నట్టు వార్తలు వస్తున్నాయి.


Share

Related posts

అఖిల ప్రియ కీలక నిర్ణయం… ఎవరి ఎఫెక్టో… ఏమీ పేరో?

CMR

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ తో కమెడియన్ ప్రియదర్శి..!!

sekhar

TDP YSRCP: చంద్రబాబు – మంత్రి అప్పలరాజు మధ్య కేసులాట..! నేడు మళ్ళీ మంత్రిపై..!!

somaraju sharma