Jathi Ratnalu: ఉద్యోగాలు ఇప్పిస్తున్న జాతి రత్నాలు హీరో..!!

Share

Jathi Ratnalu: “జాతి రత్నాలు” సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలుసు. పాండమిక్ తర్వాత రిలీజ్ అయిన ఈ సినిమా ఎటువంటి అంచనాలు లేకుండా భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. కె.వి అనుదీప్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాని నాగ్ అశ్విన్ ప్రొడ్యూస్ చేయడం జరిగింది. సినిమా ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన “జాతి రత్నాలు” సినిమా బాక్సాఫీస్ దగ్గర బీభత్సమైన కలెక్షన్స్ రాబట్టింది. సినిమాలో హీరోగా నటించిన నవీన్ పోలిశెట్టి కి మంచి గుర్తింపు దక్కింది. ఇదిలా ఉంటే నవీన్ పొలిశెట్టి కరోనా కారణంగా ఉద్యోగాలు కోల్పోయిన వారికి తన వంతు సహాయం అందిస్తూ.. ఉద్యోగాలు ఇప్పిస్తున్నారు.

నవీన్ పోలిశెట్టి చొరవతో ఉద్యోగం పొందిన యువకుడు

సోషల్ మీడియాలో తన దృష్టికి వచ్చిన ఇటువంటి విషయాలలో స్పందిస్తూ ఉద్యోగాలు ఏదోవిధంగా ఇచ్చే రీతిలో కల్పిస్తూ.. నిరుద్యోగుల కుటుంబాలలో సంతోషాన్ని నింపుతున్నారు. తాజాగా సమీర్ అనే యువకుడు రీతిగానే లాక్ డౌన్ సమయంలో.. ఉద్యోగం కోల్పోవడంతో ఈ విషయం తన దృష్టికి రావడంతో వెంటనే.. నవీన్ పోలిశెట్టి ఈ వోక్- వేగన్ స్టోర్ అండ్ కేఫ్ అనే కంపెనీ లో స్టోర్ మేనేజర్ ఉద్యోగాన్ని ఇప్పించడం జరిగింది.

 

ఈ సందర్భంగా సదరు కంపెనీ ఉద్యోగం కల్పిస్తూ ఇచ్చిన ఆఫర్ లెటర్ నీ నవీన్ పోలిశెట్టి సోషల్ మీడియా ద్వారా… సమీరా అనే వ్యక్తి దృష్టికి తీసుకొచ్చి త్వరలోనే తాను స్టోర్ కి వెళ్తున్నట్లు.. స్పష్టం చేశారు. ఈ క్రమంలో తన దృష్టికి ఈ సమస్యను తీసుకొచ్చిన చరణ్, సౌమ్య అనే ఇద్దరిని నెటిజన్లకు కృతజ్ఞతలు కూడా తెలిపారు. ఇక ఇదే రీతిలో మరికొంత మందికి ఉద్యోగాలు కల్పించే రీతిలో.. అందరూ సహాయపడాలని.. చేతనైనంత వరకు సాయం చేద్దాం ఉద్యోగాలు కల్పిస్తామని నవీన్ పోలిశెట్టి సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు.


Share

Related posts

బ్రేకింగ్ : 2020 లో మరో దరిద్రం .. సింగరేణి కోల్ మైన్స్ లో !

siddhu

Brushing: రోజు ఇలా మాత్రం బ్రష్ చేయకండి!!

Kumar

మోడీతో కేసీఆర్, జగన్ ల బేటీ వెనక అసలైన స్టోరీ అదేనట..??

sekhar