Jathi Ratnalu – Prabhas : ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ ఫేమ్ నవీన్ పోలిశెట్టి హీరోగా మణిదీప్ దర్శకత్వంలో తెరకెక్కిన కామెడీ ఎంటర్టైనర్ జాతి రత్నాలు.. ఇందులో ఫరియా అబ్దుల్లా హీరోయిన్గా నటిస్తోంది.. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ విడుదల చేయడానికి జాతి రత్నాలు టీమ్ రెబల్ స్టార్ ప్రభాస్ ను కలిశారు.. ట్రైలర్ లాంచ్ కోసం జాతిరత్నాలు టీమ్ జోగిపేట్ నుంచి ముంబైకి వెళ్లిన నేపథ్యంలో ఒక ఫన్నీ వీడియో ని చిత్ర బృందం రిలీజ్ చేసింది..

జాతిరత్నాలు – జోగిపేట్ to బాంబే పేరుతో విడుదల చేసిన ఈ వీడియో లో ట్రైలర్ లాంచ్ కోసం ప్రభాస్ ని కలవడానికి మన జాతిరత్నాలు చేసిన రచ్చని చూపించారు.. ఫ్లైట్ లో స్టార్ట్ అయినప్పటి నుంచి ప్రభాస్ ని మీట్ అయిన వరకు అందరూ కలిసి సందడి చేసారు. చివరకు డార్లింగ్ ప్రభాస్ ని కలిసి జాతిరత్నాలు ట్రైలర్ ని విడుదల చేశారు. ట్రైలర్ చూసిన ప్రభాస్ పది సార్లు నవ్వానని.. ఇంక సినిమా ఎలా ఉంటుందో అర్ధం అవుతోందని చిత్ర యూనిట్ ని అభినందించారు. సాయంత్రం 4:20 నిమిషాలకు ట్రైలర్ విడుదల కానుంది.. ఈ లోపు ప్రభాస్ తో రచ్చ చూసేయండి..