Jathi Ratnalu : కొన్ని సినిమాలపై ముందు నుంచి కూడా ఏదో తెలియని పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి.. అలాంటి సినిమానే జాతి రత్నాలు..!! ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి పాజిటివ్ వైబ్స్ వినిపిస్తున్నాయి..! నవీన్ పోలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామక్రిష్ణ కీలక పాత్రల్లో నూతన దర్శకుడు అనుదీప్ తెరకెక్కించిన చిత్రం జాతి రత్నాలు..!! ఈ సినిమా మార్చి 11న మహా శివరాత్రి సందర్భంగా విడుదల కానుంది..! ఇదే రోజున గాలి సంపత్, శ్రీకారం, రాబర్ట్ సినిమాలు కూడా అదే రోజున రిలీజ్ కానున్నాయి..! మరి జాతి రత్నాలు మూవీ టాక్, ప్రీ రిలీజ్ బిజినెస్, ఎన్ని థియేటర్స్ లో విడుదలవుతుంది, టికెట్ బుకింగ్స్ వంటి పూర్తి విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం..!!
ఈ సినిమా మొత్తం 410 థియేటర్స్ లో రిలీజ్ కానుంది.. ఇక చిన్న సినిమానే అయినా సెన్సషనల్ క్రేజ్ ని సొంతం చేసుకున్న జాతి రత్నాలు నైజాం లో 110 థియేటర్స్ లో టోటల్ గా రెండు తెలుగు రాష్ట్రాలలో 390 థియేటర్స్ లో రిలీజ్ అవ్వనుంది.
ఇప్పటికే అన్ని సినిమాల ఆఫీషియల్ ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలు బయటకు వచ్చాయి. జాతి రత్నాలు సాలిడ్ ప్రీ రిలీజ్ బిజినెస్ తో దుమ్ము లేపుతోంది.. ఈ సినిమా దాదాపు 11 కోట్ల రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ ను సొంతం చేసుకున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమా మొత్తం బడ్జెట్ 11.5 కోట్లు అవ్వగా.., 11 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ ద్వారానే రావడం తెలుగు సినిమాకు గొప్ప వరమే..!!
ప్రజెంట్ రిలీజ్ అవుతున్న 4 సినిమాలలో హాట్ ఫేవరేట్ మాత్రం జాతి రత్నాలు అనే చెప్పాలి. అల్టిమేట్ క్రేజ్ ఉన్న ఈ చిత్రం మిగతా సినిమాలను సూపర్ డామినేట్ చేయడం ఖాయం..! ఇప్పటికే అన్ని సినిమాల అడ్వాన్స్ టికెట్ బుకింగ్స్ మొదలు అయినా జాతి రత్నాలు ఒక్కటే నెక్స్ట్ లెవెల్ లో జరుగుతున్నాయి.. మిగిలిన సినిమాలు అన్ని జస్ట్ బి లో యావరేజ్ లైన్లోనే ప్రజెంట్ ఉన్నాయి.. ఇక ఫస్ట్ డే కలెక్షన్స్ ప్రిడిక్షన్స్ విషయానికి వస్తే.. జాతి రత్నాలు అవలీలగా 3-4 కోట్ల రేంజ్ కలెక్షన్స్ ని సొంతం చేసుకోవచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ సినిమా అన్నింటిలో ముందుండి.. హాట్ ఫేవరేట్ గా నిలిచింది..!
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?