Naveen Polishetty : నవీన్ పొలిశెట్టి Naveen Polishetty తెలుసు కదా. ప్రస్తుతం నవీన్ పొలిశేట్టే ఎక్కడ చూసినా ట్రెండింగ్ టాపిక్. జాతిరత్నాలు సినిమాతో నవీన్ పొలిశెట్టి రేంజే మారిపోయింది. ఆయనతో పాటు.. ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ రేంజ్ కూడా ఓ రేంజ్ లో మారిపోయింది.
నవీన్ పొలిశెట్టి.. ఏజెంట్ ఆత్రేయ సినిమాతోనే సూపర్ సక్సెస్ అందుకున్నాడు. ఆ తర్వాత జాతి రత్నాలు సినిమాతో సూపర్ స్టార్ అయిపోయాడు. ఇన్ని రోజులు సినిమాల్లో చాన్స్ కోసం వెయిట్ చేసిన నవీన్ కు అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయి.

Naveen Polishetty : నెంబర్ వన్ యారీ షోలో జాతి రత్నాలు టీమ్ సందడి
అయితే.. తాజాగా నెంబర్ వన్ యారీ షోలో జాతి రత్నాలు టీమ్ సందడి చేసింది. జాతి రత్నాలు సినిమాలో లీడ్ రోల్స్ లో నటించిన నవీన్ పొలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ.. ఈ ముగ్గురూ రానా దగ్గుబాటి నెంబర్ వన్ యారీ షోలో ప్రత్యక్షమయ్యారు.
తాజాగా నెంబర్ వన్ యారీ షో మూడో సీజన్ ఆహా ఓటీటీలో ప్రారంభం అయిన సంగతి తెలిసిందే. ఎపిసోడ్ వన్ ను జాతిరత్నాలు టీమ్ తో ప్లాన్ చేశారు. ఈసందర్భంగా జాతిరత్నాలు టీమ్ అక్కడికి వచ్చి చేసిన సందడి మామూలుగా లేదు. రచ్చ రంబోలా చేశారు. హోస్ట్ రానా దగ్గుబాటినే ఆటపట్టించారు వీళ్లు.
రానా స్టేజ్ మీదికి రాగానే.. బాహుబలి సినిమా తెలుసా మీకు. ఆ సినిమా చూశారా మీరు.. అంటూ భళ్లాలదేవనే ప్రశ్నించారు వీళ్లు.
వామ్మో.. వీళ్ల కామెడీ మామూలుగా లేదు. ఎక్కడికెళ్లినా ఇంతలా కామెడీ చేయడమా? మొత్తానికి సినిమాలోనే కాదు.. నెంబర్ వన్ యారీ షోలో కూడా వీళ్ల కామెడీ అదిరిపోయింది. దీనికి సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలైంది. ఇంకెందుకు ఆలస్యం.. మీరు కూడా ఆ ప్రోమోపై ఓ లుక్కేయండి.