జయకు కోపం వచ్చింది!

జయా బచ్చన్‌కు కోపం వచ్చింది. ముంబైలో ఒక బర్త్‌డే పార్టీ నుంచి బయటకు వచ్చిన జయను అక్కడున్న ఒక వ్యక్తి మొబైల్‌లో ఫొటో తీశాడు. దానితో ఆమె ఆగి అతనిని దగ్గరకు పిలిచి మొబైల్‌లో ఫొటో ఎందుకు తీస్తున్నావ్, కాస్త మానర్స్ నేర్చుకో అంది. ఇంకో అడుగు వేయగానే మరొక వ్యక్తి అదే పని చేయడంతో అతనిని కూడా మందలించింది. అతను సారీ చెప్పడంతో ‘ఏం, ఇంగ్లీష్‌లో ఆ పదం ఒక్కటే నేర్చుకున్నావా’ అని ప్రశ్నించింది.

జయా బచ్చన్‌కు ఫొటోగ్రాఫర్లు అంటే పడదన్న విషయం అందరికీ తెలిసిందే. 2017లో కూడా ఇట్లాగే అనుమతి అడక్కుండా ఫొటోలు తీసినందుకు తిడుతున్న వీడియో వైరల్ అయింది. తాజాగా వైరల్ అయిన వీడియోలో అక్కడున్న ఫొటోగ్రాఫర్లు కూడా ఆమెను అనుసరించడమా లేక వదిలిపెట్టడమా అని చర్చించుకోవడం వినపడుతుంది.

https://www.instagram.com/p/BvJcJppjMC3/?utm_source=ig_web_copy_link