సీనియర్ నటుడు శోభన్ బాబు టాలీవుడ్లో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి ఎంతో మంది అభిమానుల మనసు గెలుచుకున్నాడు. తెలుగు చిత్రసీమలో అందగాడిగా, సోగ్గాడిగా పేరు తెచ్చుకొని అమ్మాయిల హృదయాలను దోచేశాడు. ఈ హీరోకి తన శారీరక అందం అంటే చాలా ఇష్టం. ఎప్పుడు కూడా తాను అందంగానే కనిపించాలని ఆయన కోరుకునే వాడు. అందుకే ముసలి వయసు వచ్చాక.. కాస్త అందవిహీనంగా మారాక.. తన ఆహార్యాన్ని చూపించడం ఇష్టం లేక సినిమాల్లో నటించడం మానేశారు. ఈ మాజీ హీరో తెలుగులోనే కాదు తమిళంలో కూడా తన సత్తా చాటాడు. ఆ సమయంలోనే శోభన్ బాబు, జయలలిత ప్రేమలో ఉన్నారని సినీ వర్గాలు కోడై కూశాయి. అయితే ఇందులో నిజముందో లేదో తెలియదు కానీ తాజాగా శోభన్‌బాబు తన డైరీలో జయలలిత గురించి రాసిన కొన్ని విషయాలు అందరిని ఆశ్చర్య పరుస్తున్నాయి.
జయలలిత తల్లి చనిపోయింది
జయలలిత, శోభన్‌బాబు కాంబినేషన్లో “డాక్టర్ బాబు” అనే సినిమా తెరకెక్కింది. వీరిద్దరి కాంబోలో వచ్చిన మొదటి, చివరి సినిమా ఇదే కావడం గమనార్హం. ఈ సినిమా షూటింగ్‌కి కొన్ని రోజుల ముందే జయలలిత తల్లి కన్నుమూసారట. తల్లి మరణం తరువాత జయలలిత బాగా మానసికంగా కుంగిపోయారు. ఆ సమయంలో ఆమెను అక్కున చేర్చుకుని ఓదార్చే వారు కరువయ్యారు. అప్పుడే శోభన్ బాబులో ఆమె తన తల్లిని చూసుకుందట. ఈ విషయాన్ని స్వయంగా శోభన్ బాబు తన డైరీలో రాసుకున్నాడు. డాక్టర్ బాబు సినిమా షూటింగ్ ఊటీలో జరిగింది. ఆ సమయంలో జయలలిత గురించి ఆసక్తికరమైన విషయాలను తన డైరీలో పేర్కొన్నాడు.
ఆ డైరీలో ఉన్నది ఏమిటంటే
“బరువైన తన మనసుని నీ జోకులతో తేలిక చేసావు. ప్రపంచం ఇప్పుడు ఎంతో నిర్మలంగా కనిపిస్తుంది. అందరితో మాట్లాడాలి, కలిసి ఉండాలని అనిపిస్తుంది” అని తనతో జయలలిత చెప్పినట్లు డైరీలో శోభన్ బాబు రాసుకొచ్చాడు. “నా అమ్మగారు మరణించాక నా అనుకున్నవాళ్లే నాకు వెన్నుపోటు పొడిచారు. బంధువులు డబ్బు కోసమే ఆశ పడ్డారు. ఇవన్నీ చూసి ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియని నిస్సహాయ పరిస్థితిలో ఉండిపోయాను. ఇలాంటి అత్యంత బాధాకరమైన జీవిత దశనుంచి మీరు వచ్చాకే నాకు విముక్తి దొరికింది” అని జయలలిత తనతో ఎమోషనల్‌గా చెప్పినట్టు శోభన్ బాబు తెలిపాడు. ఈ డైరీ చదువుతుంటే వీరిమధ్య ఒక అన్నా చెల్లె, తండ్రి కూతురు వంటి పవిత్రమైన స్వచ్ఛమైన బంధం ఉందని తెలుస్తుంది తప్ప వారి మధ్య ప్రేమ లేదని స్పష్టమవుతోంది. ఇదే విషయాన్ని పలువురు కూడా ఒప్పుకుంటున్నారు.
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!