NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

AP Sand Mining : ఏపీలో ఇసుక తుఫాన్!జగన్ సర్కారుపై ఒంటికాలిమీద లేచిన టిడిపి ..జనసేన!!

AP Sand Mining : ఇసుక రీచ్‌ల్లో తవ్వకాల బాధ్యతలను జగన్ ప్రభుత్వం జేపీ ప్రైవేట్‌ వెంచర్స్‌ లిమిటెడ్‌కు అప్పజెప్పడంపై తెలుగుదేశం, జనసేన పార్టీలు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డాయి. ఇంతలో దీంతో రాష్ట్రంలో మరో రాజకీయ దుమారం రేగింది. టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభిరామ్‌, జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ ఈ విషయంలో విమర్శలు గుప్పించారు.

jayaprakash power secures two year sand mining contract from ap govt
jayaprakash power secures two year sand mining contract from ap govt

AP Sand Mining :  ఇది క్విడ్‌ప్రోకో వ్యవహారమన్న టిడిపి

నాలుగైదేళ్లుగా జేపీ పవర్‌ వెంచర్స్‌ నష్టాల్లో ఉందని.. అలాంటి సంస్థకు ఇసుక రీచ్‌లను ఎలా అప్పజెబుతారని టిడిపి అధికార ప్రతినిధి పట్టాభి ప్రశ్నించారు.ఏటా 3వేల500 కోట్ల నష్టాలను చవి చూస్తూ.. రేపో, మాపో దివాలా తీయబోయే జేపీ పవర్‌ వెంచర్స్‌కు ఇసుక రీచ్‌లను కట్టబెట్టడం దారుణమని అన్నారు టీడీపీ నాయకులు పట్టాభిరామ్‌. జేపీ పవర్‌ వెంచర్స్‌ సంస్థకు సిమెంటు, థర్మల్‌ విద్యుత్తు యూనిట్ల నిర్వహణలో కాస్తో కూస్తో అనుభవం ఉందని, అయితే ఇసుక రేవులు నిర్వహించిన అనుభవం లేదని అన్నారు. అలాంటి సంస్థకు ఇసుక రీచ్‌లను అప్పగించడానికి క్విడ్‌ప్రోకోనే ప్రధాన కారణమని ఆరోపించారు.

ఆ సంస్థ ఎంపికకు ప్రాతిపదిక ఏమిటో చెప్పాలన్న జనసేన!

మరోవైపు జనసేన కూడా ప్రభుత్వ నిర్ణయంపై మండిపడింది. ఇసుక సరఫరాను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడం సరికాదని, ఇసుకను ప్రభుత్వ యంత్రాంగమే నిర్వహించలేకపోయిందని.. ఇక ప్రైవేటువాళ్లు ఎలా సరఫరా చేస్తారని ప్రశ్నించారు. ప్రజలను మోసం చేసేలా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని విమర్శించారు. జేపీ సంస్థను ఎలా ఎంపిక చేశారో ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల ద్వారా భవన నిర్మాణ కార్మికులు మరోసారి రోడ్డున పడే అవకాశాలున్నాయని నాదెండ్ల ఆందోళన వ్యక్తంచేశారు. సామాన్యుడికి ఎలా భరోసా కల్పిస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు.అయితే ఇప్పటివరకు ఈ విషయమై అధికార వైసీపీ గాని రాష్ట్రప్రభుత్వం గాని స్పందించి ఎటువంటి సమాధానం ఇవ్వలేదు.

 

author avatar
Yandamuri

Related posts

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!

Breaking: కేరళ సీఎం కుమార్తె పై మనీలాండరింగ్ కేసు

sharma somaraju

Most Expensive Indian Films: అత్య‌ధిక బ‌డ్జెట్ తో తెర‌కెక్కిన టాప్‌-10 ఇండియ‌న్ మూవీస్ ఇవే.. ఫ‌స్ట్ ప్లేస్ ఏ సినిమాదంటే?

kavya N

YSRCP: కుమారుడు జగన్‌కే విజయమ్మ ఆశీస్సులు

sharma somaraju

Heera Rajagopal: ఆవిడా మా ఆవిడే హీరోయిన్ హీరా గుర్తుందా.. అజిత్ కు భార్య కావాల్సిన ఆమె ఇప్పుడెక్క‌డ ఉందో తెలుసా?

kavya N

Siddharth: స్టార్ హీరోయిన్ మెడ‌లో మూడు ముళ్లు వేసిన సిద్ధార్థ్.. ఆ ప్రాంతంలో సీక్రెట్ గా వివాహం!

kavya N

Venkatesh: 6 భాష‌ల్లో రీమేక్ అయ్యి అన్ని చోట్ల బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిలిచిన వెంక‌టేష్ సినిమా ఇదే!

kavya N

Ram Charan: త‌న చిత్రాల్లో రామ్ చ‌ర‌ణ్ కు మోస్ట్ ఫేవ‌రెట్ ఏదో తెలుసా.. మీరు ఊహించి మాత్రం కాదు!

kavya N

ED: మరో ఆప్ నేత ఇంట్లో ఈడీ సోదాలు

sharma somaraju

Raadhika Sarathkumar: క‌ళ్లు చెదిరే రేంజ్ లో న‌టి రాధిక ఆస్తులు.. మొత్తం ఎన్ని కోట్లంటే..?

kavya N