NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

JC Diwakar : జెసికి పాఠం ఇంకా బోధపడినట్లు లేదు..! ఆధారాలు లేని మాటలు ఎప్పటికైనా డేంజరే…

JC Diwakar :  టిడిపి సీనియర్ నేత మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి తాజాగా కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. మామూలుగా అతను ఏమి మాట్లాడినా అవి చివరికి వివాదాస్పదంగా మారుతాయి. అతని నోటి నుండి ఎంతటి మాట వచ్చినా…. అది విన్న వారు ఇందులో అతిశయోక్తి ఏమీ లేదు అన్నట్లు అంటుంటారు. దానికి తగ్గట్లే ఈ రాయలసీమ నేత మాటలు కూడా ఉంటాయి. రాజకీయాల్లో అతను మాట్లాడే తీరే వేరుగా ఉంటుంది. .

 

JC Diwakar comments on Jagan and AP police
JC Diwakar comments on Jagan and AP police

ఏపీ లో పోలీసులే ఓట్లు వేస్తున్నారు….

ఇంతకీ విషయం ఏమిటంటే…. ఆయన తాజాగా రాష్ట్ర రాజకీయాలపై చేసిన కామెంట్లు దుమారం లేపాయి. మొత్తం దేశంలోనే రాజకీయాలు కలుషితం అయ్యాయని…. అభివృద్ధి చూసి ప్రజలు ఓట్లు వేసే రోజులు పోయాయని అన్నారు. అంతే కాకుండా మరొక అడుగు ముందుకు వేసి ఏపీలో పోలీసు రాజ్యం నడుస్తోందని ఓట్లు కూడా వాళ్లే వేయిస్తున్నారని ఆరోపణలు చేశారు. తాజాగా జరిగిన ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం నిలబెట్టిన క్యాండిడేట్లు ప్రభంజనం సృష్టించిన విషయం తెలిసిందే. ఏకంగా చంద్రబాబు నియోజకవర్గమైన కుప్పంలో 5 సీట్లు మినహాయించి అన్నీ అధికార పార్టీ బలపరిచిన వారు కైవసం చేసుకున్నారు. ఆ విషయం టిడిపి నేతలకు మింగుడు పడడం లేదు. ఇలాంటి సమయంలోనే జేసి చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా నిలిచాయి.

అందులో బాబు ఓడిపోయారు….

వివరాల్లోకి వెళితే… దివాకర్ రెడ్డి మాట్లాడుతూ వైసిపికి జనాల్లో అభివృద్ధి చూసి ఓటు వేశారని చెప్పడం అబద్ధం అని అన్నారు. అది అంత దొంగ మాట…. డబ్బు లేనిదే ఎన్నికల్లో ఎవరు గెలవలేరు… డబ్బు ప్రభావంతోనే వారి అభ్యర్థి గెలుపొందారు అని అన్నారు. చంద్రబాబు తన సొంత నియోజకవర్గం కుప్పంను బ్రహ్మాండంగా అభివృద్ధి చేశారని… అయితే ఈ ఎన్నికల్లో వైసీపీ తో డబ్బు ఇచ్చే విషయంలో పోటీ పడలేక ఓడిపోయారు అన్నారు జేసీ.

JC Diwakar మరీ ఇంతలానా…?

వెంటనే అతడి మాటలు అందుకున్న వైసీపీ కార్యకర్తలు… అంటే టీడీపీ గెలిచిన ప్రతి చోట డబ్బులు వెదజల్లి గెలిచినట్లు జేసీ చెబుతున్నారా? అని ప్రశ్నిస్తున్నారు. అంతేకాకుండా చేసి పోలీసు శాఖ పై అనుచిత వ్యాఖ్యలు చేయడం ఎటువంటి ఆధారాలు లేకుండా ఇలా మాట్లాడడం అనేది అతనికి తగదని అంటున్నారు. అంతేకాకుండా ఏపీ సీఎం పై సంచలన వ్యాఖ్యలు చేసిన జేసి ఒక్క రోజుకి జగన్ ఆదాయం 300 కోట్లు అని అన్నారు.

ఇలా ప్రతిసారి లాజిక్ లేకుండా… అధారాలు లేకుండా చేయడం చివరికి అతనినే ఇరుకున పడేస్తాయని ఈ టీడీపీ సీనియర్ నేత తెలియంది కాదు. అయినా తమ్ముడు జైలుకు వెళ్లి వచ్చి… ఇలానే నోటి దురుసుతో పలు కేసుల్లో ఇరుక్కున్నా కూడా జేసి ఇలా మాట్లాడడం ఎప్పటికైనా అతనికే డేంజర్.

Related posts

YS Sharmila: కడపలో నామినేషన్ లో దాఖలు చేసిన వైఎస్ షర్మిల

sharma somaraju

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?

ఏపీలో 15 రోజుల్లో ఈక్వేష‌న్లు మారిపోతాయ్‌… కొతగా ఏం జ‌రుగుతోంది…?

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju