Bigg Boss 5 Telugu: మరికొద్ది గంటల్లో ప్రారంభం కాబోయే బిగ్ బాస్ రెండో రోజు ఎపిసోడ్ కి సంబంధించి ప్రోమో తాజాగా రిలీజ్ అయింది. ఈ క్రమంలో జెస్సి మొదటి నుండి ఇంటిలో బాగా హడావిడి చేస్తున్న సంగతి తెలిసిందే. రెండో రోజు ఇంటి సభ్యుల దుస్తులను వాళ్లకు సంబంధించిన రకరకాల వస్తువులను దాచిపెట్టిన తాజాగా యానీ మాస్టార్ ని రెచ్చగొట్టే రీతిలో వ్యవహరించాడు. యానీ మాస్టారు పట్ల వ్యవహరించిన తీరు చూసి ఇంటిలో ఉన్న సభ్యులంతా ఒక్కసారిగా షాక్ అయిపోయారు. విషయంలోకి వెళితే..జెస్సీ ఓ కుర్చీపై కాలు వేసుకుని కూర్చోగా అక్కడికి వచ్చిన యానీ మాస్టర్ కుర్చీలో నుంచి కాలు తీయమని చెబుతుంది. దానికి జెస్సి ఒప్పుకోడు.
ఈ దెబ్బతో యానీ మాస్టర్ కి చిరెత్తుకుని రావడంతో.. నీది నీ దగ్గర పెట్టుకో, నాటకాలు చేయకు అని జెస్సి పై డైలాగులు వేయడం జరుగుతుంది. నీ వాయిస్ లేస్తే నా గొంతు లేవదా? అని నిందిస్తుండగా జెస్సీ దానికి రియాక్షన్‌గా రెచ్చ గొట్టేరీతిలో గట్టిగట్టిగా చప్పట్లు కొట్టాడు. అదే టైం లో అక్కడికి సిరి వస్తే మాత్రం జెస్సి వెంటన్నే కుర్చీపై నుంచి కాలు తీసేయడం జరుగుతుంది. దీంతో నామినేషన్ల సమయంలో ఒకలాగా ఆ తర్వాత యానీ మాస్టారు పట్ల మరో జెస్సీ వ్యవహరించడంతో… తొందరగానే ఇంటిలో నుంచి వెళ్లిపోయే లాగ ఉన్నాడు అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
చీటికి మాటికి రెచ్చిపోవడం తోపాటు.. అనవసర విషయాల్లో కలుగజేసుకొని మరి ఇతరులచేత చేయించు కోవడం ఎవరైనా తిడితే ఏడవడం తో జెస్సీ.. పెద్దగా మైండ్ బ్యాలెన్స్ చేసే వ్యక్తి కాదని నెటిజన్లు అంటున్నారు. పైకి అమాయకత్వం గా కనపడుతున్న గాని మంచి వైడ్ యాంగిల్ ఉందని మరికొంతమంది జెస్సీ ఆటతీరుపై సెటైర్లు వేస్తున్నారు. ఏది ఏమైనా సెకండ్ డే తో పాటు మూడో రోజు జెస్సీ ఆడిన గేమ్ పై సోషల్ మీడియాలో నెటిజన్లు నెగిటివ్ కామెంట్లు చేస్తున్నారు.