Bigg Boss 5 Telugu: బయటకు వెళ్లిపోయిన జెస్సి… శ్వేతా కి ఊహించని షాక్ ఇచ్చాడు..!!

Share

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్(Bigg Boss) హౌస్ లో.. గత వారం ఎలిమినేషన్ నామినేషన్ లో.. ఐదుగురు నామినేట్ కాగా… ఎవరి ఇంటి నుండి ఎలిమినేట్ అవుతారని ఉత్కంఠభరితంగా మారింది. చివరాఖరికి ఐదుగురిలో మానస్(Manas), కాజల్(Kajal) మిగిలి ఉన్న సమయంలో వాళ్ళిద్దరి లో.. ఒక రిలీజ్ డేట్ అవుతారని నాగార్జున ప్రకటించిన తర్వాత జేస్సి(Jessy)నీ సీక్రెట్ రూమ్ నుండి బయటకు పిలిచి.. హెల్త్ బా లేని నేపథ్యంలో..జెస్సీ(Jessy) నీ బయటకు పంపిస్తున్నట్లు.. తెలియజేసి మానస్(Manas), కాజల్(Kajal) నీ సేఫ్ చేయడం జరిగింది. ఇటువంటి తరుణంలో జెస్సీ(Jessy) ఇంటి నుంచి బయటకు వెళ్తూ…చాలా బావోద్వేగం కి గురి అయ్యాడు. తనని సపోర్ట్ చేసిన వారికి సరైన న్యాయం చేయలేక పోయినట్లు, హెల్త్ బాగో లేకపోవటంతో… నిరుత్సాహ పరచడం జరిగిందని.. ప్రేక్షకులు క్షమించాలని కోరాడు. ఈ క్రమంలో హౌస్ నుండి వెళ్తూ వెళ్తూ… ఇంటిలో ఉన్న సభ్యులకు సలహాలు సూచనలు..జెస్సీ ఇవ్వడం జరిగింది. సన్నీ(Sunny) కి సలహా ఇస్తూ గేమ్ అంతా బాగానే ఉన్నా… కొంతమంది వల్ల ప్రభావితం అవుతున్నట్లు, నీ గేమ్ నువ్వు ఆడితే తిరుగు ఉండదని చెప్పటం జరిగింది.

Bigg Boss 5: Love stories of housemates

ఇక షణుకి గేమ్ అంత బాగానే ఉన్నా..ఫిజికల్ టాస్క్ లో కొద్దిగా బెటర్ గా రాణించాలని తెలిపాడు. మిగతా గేమ్ మొత్తం చాలా బాగుంది అని.. మెచ్చుకోవటం జరిగింది. వెంకయ్య సమయంలో రవికి సలహాలు ఇస్తే కచ్చితంగా ఫైనల్ వెళ్ళటం గ్యారెంటీ అని.. మళ్లీ ఫైనల్స్ లో కలుద్దాం అంటూ జెస్సీ రవి ఆటో గురించి చాలా కాన్ఫిడెంట్ గా మాట్లాడాడు. శ్రీ రామ్ తో కూడా పాజిటివ్ గా మాట్లాడి ..ఇలానే గేమ్ ఆడితే తిరుగుండదని చెప్పుకొచ్చాడు. ఈ తరుణంలో సిరి తో మాట్లాడి.. వచ్చేవారం బయటకు వచ్చే నేను వెయిట్ చేస్తాను…అంటూ ఆట పట్టించారు. ఆ తర్వాత నాగార్జున పక్కన ఉండగానే జెస్సీ…సిరిని కిస్ అడగడం ఆదివారం ఎపిసోడ్ మొత్తానికి హైలెట్ లలో ఒకటి. నాగార్జున చూస్తూ ఉండగానే చాలా స్వీట్ గా.. సిరితో జెస్సీ మాట్లాడటం జరిగింది.

Who is Swetha Varma, Contestant on Bigg Boss Telugu 5

బయటకు వచ్చాక శ్వేత తో వీడియో రూపంలో

ఆ తర్వాత బయటకు వచ్చిన జెస్సీ…తోటి హౌస్ మేట్ శ్వేతని కలవడం జరిగింది. అషు రెడ్డి, శ్వేత తో కలిసి విడియో ద్వారా మాట్లాడుతూ… శ్వేతకి ప్రపోజ్ చేయడం జరిగింది. గతంలో హౌస్ లో ఉన్న సమయంలోనే శ్వేతతో చాలా క్లోజ్ గా మూవ్ అవడం తెలిసిందే. శ్వేత కూడా ఇంటి నుండి బయటకు వెళ్లిన సమయంలో జెస్సీ హౌస్ లో ఉన్నంత కాలం.. తనకు సపోర్ట్ గా నిలుస్తూ వచ్చాడని తెలపడం జరిగింది. ఈ తరుణంలో బయటకు వచ్చాక శ్వేత తో వీడియో రూపంలో మాట్లాడుతూ వర్టిగో తో… బాధపడుతున్నా గాని.. లైవ్ వీడియో లో శ్వేతకి ఐ లవ్ యు చెప్పేసాడు. ఆ తర్వాత శ్వేతా వల్లనే.. బిగ్ బాస్ తనని ఇంటి నుండి బయటకు పంపించినట్లు జెస్సీ కామెడీగా డైలాగులు వేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక ఇదే తరుణంలో బిగ్ బాస్ హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్ లను ఫస్ట్ ఇంటర్వ్యూ చేసే అరియానా కి కూడా జెస్సీ ఇంటర్వ్యూలో ఐలవ్యూ చెప్పడం విశేషం. ఏది ఏమైనా హౌస్ లో కొందరితో ఎంతో రొమాంటిక్ గా వ్యవహరించాడు అదేరీతిలో ఇంటి నుండి ఎలిమినేట్ అయిన తర్వాత కూడా…జెస్సీ ఆ విధంగానే వ్యవహరించడం విశేషం.


Share

Related posts

పై నుండి వచ్చి పడిన మృత్యువు

somaraju sharma

అమెరికాలో దారుణం.. గర్భిణి క‌డుపు కోసి బిడ్డ‌ను లాక్కెళ్లి.. చివరికి?

Teja

ఆర్కే ఇప్పుడు జగన్ ని అన్న మాటలు వింటే…. వైసీపీ అభిమానులు ఏం చేస్తారో….

arun kanna