Bigg Boss 5 Telugu: ఆ టైంలో నేను ఉంటే సిరి చెంప పగలగొట్టే వాడిని..జెస్సీ వైరల్ కామెంట్స్..!!

Share

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్(Bigg Boss) సీజన్ ఫైవ్ లో..హౌస్ నుండి అనారోగ్యం కారణంగా బయటకు వచ్చేసిన కంటెస్టెంట్ జెస్సీ(Jessy). ప్రారంభంలో హౌస్ లో అడుగుపెట్టిన సమయంలో అందరికంటే మొదటి వారంలోనే జెస్సీ ఎలిమినేట్ అవటం గ్యారెంటీ అని అందరూ భావించారు. కానీ మనోడు ప్రారంభంలో చాలా సైలెంట్ గా.. ఉంటూనే కొద్దిగా అతి చేసిన గాని ఆ తర్వాత.. ప్రతి వారానికి స్ట్రాంగ్ ప్లేయర్ గా మారి.. కెప్టెన్ అయ్యి హౌస్ లో టాప్ మోస్ట్ కంటెస్టెంట్ గా పేరు సంపాదించాడు. నామినేషన్ ప్రక్రియ లో కూడా పాయింట్ చాలా క్లియర్ కట్ గా.. మాట్లాడుతూ ప్రత్యర్థులకు దడ దడ లాడించాడు. ఫిజికల్ టాస్క్ లో కూడా తిరుగులేని ప్లేయర్ గా రాణించారు. ముఖ్యంగా షణ్ముక్(Shanmuk), సిరి(Siri) లతో కలిసిన తరువాత ఇంటిలో మరింత కొత్త వాతావరణం క్రియేట్ అయ్యేలా గేమ్ ఆడాడు.

Bigg Boss Telugu 5: Viewers slam Siri and Shannu as 'fake friends' in  Nagarjuna hosted show | Tv News – India TV

ఫ్రెండ్ షిప్ పరంగా…జెస్సీ(jessy), సిరి(Siri), షణ్ముక్(Shanmuk)…ఈ సీజన్ లో హైలైట్ గా నిలిచారు. కాగా ప్రస్తుతం గేమ్ చివరి దశకు చేరుకున్న నేపథ్యంలో ఎవరు టాప్ ఫైవ్ లో ఉంటారు..? ఎవరు బిగ్ బాస్ టైటిల్ విన్నర్ అవుతారు..? అనేది ఉత్కంఠభరితంగా ఉంది. ఇటువంటి తరుణంలో ప్రస్తుతం హౌస్ లో ఉన్న సభ్యులకు ఫుల్ టెన్షన్ లో ఉండటంతో వారిని కూల్ చేయడానికి బిగ్ బాస్ వారి కుటుంబ సభ్యులను లోనికి పంపించడం తెలిసిందే. దీంతో హౌస్ లో ఇంటి సభ్యులు చాలా కూల్ గా ఉన్నారు. హౌస్ లో పరిస్థితి ఇలా ఉంటే అనారోగ్యం కారణంగా హౌస్ నుండి బయటకు వచ్చిన జెస్సీ… ప్రస్తుతం కొద్ది కొద్దిగా కోలుకుంటూ… ప్రముఖ మీడియా ఛానల్స్ లో ఇంటర్వ్యూలు ఇస్తూన్నారు. ఈ క్రమంలో షణ్ముఖ్ సిరి… ఇటీవల కొద్ది రోజుల నుండి హౌస్లో మరింత డీప్ గా..క్లోజ్ గా మూవ్ అవడం తో ఇప్పటికే నాగార్జున.. వార్నింగ్ ఇవ్వటం జరిగింది. ఇదే సమయంలో ఫ్యామిలీ ఎపిసోడ్ లో..సిరి వాళ్ళ అమ్మ కూడా షణ్ముక్ ఆ విధంగా..ప్రతిసారి సిరి నీ హగ్ చేసుకోవడం తనకి నచ్చలేదని దారుణమైన కామెంట్లు చేయడం జరిగింది.

Bigg Boss Telugu 5: Netizens think Shanmukh and Siri's friendship is 'fake and scripted'; a look at ETimes TV's Twitter poll results - Times of India

నేను కూడా హౌస్ లోకి వెళ్ళాక…

ఇటువంటి తరుణంలో వారిద్దరి రిలేషన్ గురించి సోషల్ మీడియాలో రకరకాల కామెంట్లు వస్తున్నాయి. ఇదిలావుంటే ఇటీవల ఓ ప్రముఖ మీడియా టీవీ ఛానల్ లో…జెస్సీ ఇంటర్వ్యూ ఇవ్వగా… షణ్ముఖ సిరి మధ్య ఉన్న రిలేషన్ గురించి యాంకర్ ప్రశ్నించారు. వారిద్దరితో ఎక్కువగా హౌస్ లో ఉన్న కంటెస్టెంట్ లో మీరే సమయం బాగా గడిపారు. ఖచ్చితంగా మీకు క్లారిటీ ఉంటది అని ప్రశ్నించారు. ఈ ప్రశ్నకి జెస్సీ సమాధానమిస్తూ.. బయటి ప్రపంచంతో సోషల్ మీడియా తో ఇంటి సభ్యులతో కనెక్షన్ తగ్గిపోయిన తరువాత ఒక ప్రదేశంలో.. ఒక వ్యక్తితో బాండింగ్ ఏర్పడితే ఆ విధంగానే ఉంటుంది. అతడే సర్వస్వం అన్న తరహాలో.. హౌస్ లో వాతావరణం ఉంటది. తన ఫ్రెండ్స్ ఇద్దరు మధ్య కూడా అదే రిలేషన్ ఉంది. నేను కూడా హౌస్ లోకి వెళ్ళాక ఫ్రెండ్షిప్ పరంగా వాళ్లతో బాగా కనెక్ట్ అయ్యాను. ఎటువంటి పరిస్థితి వచ్చినా ఒక తోడు అంటూ.. మనకి బయట ప్రపంచం లో ఉంటది. కానీ బిగ్ బాస్ హౌస్ లో ఆ పరిస్థితి ఉండదు ఏదో ఒక అందుకే కనెక్షన్ దొరికింది ఆ టైంలో ఇటువంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంటుంది అని చాలా మెచ్యూర్డ్ గా మాట్లాడారు. కానీ ఇటీవల బాత్రూంలోకి వెళ్లి సిరి తన తల బదుకోవడం.. తనకు ఏమాత్రం నచ్చలేదని అదే సమయంలో నేను లోపల ఉండి ఉంటే కచ్చితంగా సిరి చెంప పగలకొట్టేవాడిని. నా ఫ్రెండ్ తన కి తను హనీ చేసుకుంటే నేను ఊరుకోను. ఇదే సమయంలో సిరి, షణ్ముక్ మధ్య జరుగుతున్నది.. పెద్ద భూతద్దంలో పెట్టి చూడాల్సిన పరిస్థితి ఏమీ లేదు. హౌస్ లో వారిద్దరూ ఒకరికి ఒకరు.. బాగా కనెక్ట్ అయ్యారు. బయటకు వచ్చాక మళ్ళీ మైండ్ నార్మల్ అయిపోతుంది..అంటూ..సిరి షణు.. రిలేషన్ గురించి జేస్సి సంచలన వ్యాఖ్యలు చేశారు.


Share

Related posts

బికినీ మీద అలిగిన స్టార్ హీరోయిన్

Naina

జగన్ – కేసీ‌ఆర్ మధ్య కొత్త గ్యాప్ : కారణం హరీష్ ? ఇదంతా పక్కా ప్లానింగ్ ?

sridhar

Narappa: నారప్ప సినిమా వాయిదా..

bharani jella