John Abraham: ఒమిక్రాన్ ప్రభావం పెద్దగా ఉండదేమో అనుకుంటుండగానే కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. చిత్ర పరిశ్రమలో వరుసగా నటీనటులు ఒమిక్రాన్ బారిన మళ్లీ పడుతున్నారు. దీంతో అభిమానుల గుండె గుభేల్మంటోంది. ముఖ్యంగా బాలీవుడ్ లో కరోనా కలకలం సృష్టిస్తోంది. తాజాగా మరో ప్రముఖ హీరో కరోనా బారిన పడ్డాడు. జాన్ అబ్రహం, అతని భార్య ప్రియా రుంచల్ కు కరోనా వైరస్ సంక్రమించింది. ఈ విషయాన్ని తాజాగా జాన్ అబ్రహం తన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో వెల్లడించాడు.
‘నేను 3 రోజుల క్రితం కోవిడ్ ఉన్న ఓ వ్యక్తిని కాంటాక్ట్ అయ్యాను. అప్పుడు ఆ వ్యక్తికి కరోనా ఉందన్న విషయం నాకు తెలీదు. తర్వాత విషయం తెలిసి ప్రియ, నేను కోవిడ్ టెస్ట్ చేయించగా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. మేం ఇంట్లోనే సెల్ఫ్ ఐసోలేషన్ లోకి వెళ్ళాము. దయచేసి అందరూ సురక్షితంగా ఉండండి. మాస్క్ ధరించండి’ అని జాన్ అబ్రహం పేర్కొన్నారు. తాము కరోనా టీకాలు తీసుకున్నామని.. తేలికపాటి లక్షణాలతో బాధపడుతున్నామని జాన్ అబ్రహం తెలిపారు.