RC15: కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అందరికీ సుపరిచితుడే. కెరియర్ పరంగా ఎంతో కష్టపడి ఎదుగుతూ.. టాలీవుడ్ నుండి సౌత్ ఫిలిం ఇండస్ట్రీ ఇంకా ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలో సైతం అవకాశాలు అందుకుంటూ బిజీ కొరియోగ్రాఫర్ గా మారిపోయాడు. మెగా ఫ్యామిలీ హీరోలకు జానీ మాస్టర్ ఆధ్వర్యంలో కంపోజ్ చేసిన చాలా సాంగ్స్ ట్రెండ్ సృష్టించాయి. ముఖ్యంగా రామ్ చరణ్ కి జానీ మాస్టర్ అందించే స్టెప్ లు ఎంతగానో ఆకట్టుకుంటాయి.
ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్ లో “RC15” రాబోతున్న సంగతి తెలిసిందే. శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఇటీవల కొంత గ్యాప్ తీసుకుని మళ్లీ ఇప్పుడు రాజమహేంద్రవరంలో మొదలుపెట్టడం జరిగింది. అయితే ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ కి కొరియోగ్రఫీ చేసినట్లు ఇటీవల సైమా అవార్డ్స్ ఫంక్షన్ లో ఓ యాంకర్ తో సంభాషణ సమయంలో జానీ మాస్టర్ తెలిపారు. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ అదిరిపోయే బిట్స్ ఇవ్వడం జరిగిందని అన్నారు.
ఇంకా కొరియోగ్రఫీ పరంగా చరణ్ సార్ పై నాకు ఉన్న ప్రేమ ఏంటో ఆ సాంగ్ లో కనిపిస్తుంది. సాంగ్ షూటింగ్ అయిపోయింది. చాలా అద్భుతంగా వచ్చింది. డైరెక్టర్ శంకర్ మంచి కాన్సెప్ట్ ఇవ్వటంతో సాంగ్ లో.. కొత్తదనం తీసుకురావడానికి చరణ్ సార్ తో ట్రై చేశాను. ఈ తరహా కాన్సెప్ట్ సాంగ్ ఇప్పటివరకు ఇండియాలో ఏ సినిమాలో రాలేదు. ఆ కెరియర్ లోనే ఇది బెస్ట్ సాంగ్ అంటూ జానీ మాస్టర్ “RC15” కి సంబంధించి కొత్త విషయాన్ని తెలియజేయడం జరిగింది.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?