22.7 C
Hyderabad
March 26, 2023
NewsOrbit
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

నయా నిజాం కేసిఆర్ అంటూ జేపీ నడ్డా ఫైర్

Share

తెలంగాణ సీఎం కేసిఆర్ .. మీర్ ఉస్మాన్ ఆలీఖాన్ బాటలోనే నడుస్తూ నయా నిజాంలా తయారైయ్యారని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపి నడ్డా విమర్శించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర ముగింపు సందర్భంగా హన్మకొండ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో జేపి నడ్డా ప్రసంగించారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కేసిఆర్ బందీ చేశారని నడ్డా వ్యాఖ్యానించారు. ఈ రోజు హన్మకొండ సభకు అడుగడుగునా ఆంక్షలు విధించారనీ, 144 సెక్షన్ ను చూపించి ప్రజానీకం రాకుండా అడ్డుకున్నారని నడ్డా మండిపడ్డారు. హైకోర్టు అనుమతితో సభ నిర్వహించుకోవాల్సిన పరిస్థితిని ఈ సర్కార్ తీసుకువచ్చిందన్నారు. వచ్చే ఎన్నికల్లో కేసిఆర్ ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపడమే తమ లక్ష్యమన్నారు. టీఆర్ఎస్ పాలనలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని అన్నారు.

 

మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మిస్తామని వరంగల్లు జైలును కూల్చారనీ, ఇన్ని రోజులు గడుస్తున్నా వరంగల్లులో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మించలేదని అన్నారు నడ్డా. జల్ జీవన్ మిషన్ కింద రాష్ట్రానికి రూ.3500 కోట్లు కేటాయిస్తే తెలంగాణ సర్కార్ మాత్రం కేవలం రూ.200 కోట్లు మాత్రమే ఖర్చు చేసిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు లో కేసిఆర్ భారీగా అవినీతి పాల్పడ్డారని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టును కేసిఆర్ ఏటిఎంగా మార్చుకున్నారని వ్యాఖ్యానించారు. ఎంఐఎంకు భయపడి కేసిఆర్ సర్కార్ తెలంగాణ విమోచన దినాన్ని నిర్వహించడం లేదని, బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ విమోచన దినం జరిపి తీరుతామని జేపి నడ్డా పేర్కొన్నారు.

 

అవినీతికి పాల్పడినందునే కేసిఆర్ లో భయం మొదలైందని అన్నారు. అవినీతి, కుటుంబ పాలన అంతం చేయాల్సిన సమయం ఆసన్నమైందని జేపి నడ్డా పేర్కొన్నారు. తొలుత రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ తో కలిసి జేపి నడ్డా భద్రాకళి అమ్మవారి ఆలయాన్ని దర్శించుకుని కాళికా మాతకు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా జేపి నడ్డాకు ఆలయ అర్చకులు సంప్రదాయ బద్దంగా స్వాగతం పలికి తీర్ధ ప్రసాదాలు అందజేశారు. సభలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్. రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్ చార్జి తరుణ్ చుగ్, తదితర నేతలు పాల్గొన్నారు.

వరంగల్లు సభకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ .. బీజేపీకి ఊరట


Share

Related posts

Shaving: షేవింగ్ చేసుకోకుండా ఉంటే మీరు ఇవన్నీ మిస్స్ అవుతారు..!

bharani jella

YS Jagan : ఈ గెలుపుతో.. జ‌గ‌న్ పై ఆ మ‌చ్చ తొల‌గిపోయిన‌ట్లే…

sridhar

Nervous Weakness: ఈ లడ్డుతో నరాల బలహీనతకు చెక్..! ఎలా తయారు చేసుకోవాలంటే..!?

bharani jella