NewsOrbit
తెలంగాణ‌ న్యూస్

NTR: ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఘన నివాళులు

NTR: తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 101వ జయంతి సందర్భంగా హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఆయన కుటుంబ సభ్యులు, టీడీపీ నేతలు నివాళులర్పించారు. ఈ తెల్లవారుజామునే ఎన్టీఆర్ ఘాట్ వద్దకు చేరుకున్న ఆయన మనవళ్లు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ లు పుష్పగుచ్చాలను ఉంచి అంజలి ఘటించారు. పెద్ద సంఖ్యలో అభిమానులు, టీడీపీ కార్యకర్తలు ఎన్టీఆర్ ఘాట్ వద్దకు చేరుకుంటున్నారు.

అలానే ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఆయన కుమారులు నందమూరి బాలకృష్ణ, నందమూరి రామకృష్ణ, టీడీపీ సీనియర్ నేత బక్కని నర్సింహులు తదితరులు నివాళులర్పించారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ ఎన్టీఆర్ సేవలను కొనియాడారు. ఎన్టీఆర్ అంటే ఒక శక్తి.. తెలుగువారికి ఆయన ఆరాధ్య దైవం అని అన్నారు. సాధారణ రైతు కుటుంబంలో పుట్టిన ఎన్టీఆర్ .. తొలుత చదువుకే ప్రాధాన్యత ఇచ్చారన్నారు. ఆ తర్వాత చిత్రరంగంలోకి వచ్చారన్నారు. ఎన్టీఆర్ అంటే నటనకు విశ్వవిద్యాలయం అని అన్నారు. సినీ రంగంలో మకుటంలేని మహారాజుగా వెలుగొందుతున్న సమయంలోనే రాజకీయాల్లోకి వచ్చారన్నారు. ఒకే ఫంధాలో వెళ్తున్న రాజకీయాలను మార్చారన్నారు. తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని చాటి చెప్పారని అన్నారు. ప్రజల్లో రాజకీయ చైతన్యం తీసుకువచ్చారని కొనియాడారు.

కాగా ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకుని తారక్ ..సదా మీ సేవలో అంటూ ఎన్టీఆర్ ఫోటోను ట్వీట్ చేశారు. “మీ పాదం మోపక తెలుగు ధరిత్రి చిన్నబోతోందని, మీ రూపు కానుక తెలుగు గుండె తల్లడిల్లిపోతోందని, పెద్ద మనసుతో ఈ ధరిత్రిని, ఈ గుండెను మరొక్కసారి తాకిపో తాతా.. సదా మీ ప్రేమకు బానిసను” అని రాసుకొచ్చారు తారక్.

టీడీపీ అధినేత చంద్రబాబు .. ఎన్టీఆర్ ను స్మరించుకుంటూ ట్వీట్ చేశారు. తెలుగు వెలుగు, తెలుగు జాతికి స్పూర్తి, కీర్తి ..అన్న ఎన్టీఆర్ అని పేర్కొన్నారు. ఆ మహనీయుడి 101వ జయంతి సందర్భంగా నివాళులు అర్పిస్తూ అన్నదారి సేవలను స్మరించుకుందామన్నారు.

“క్రమశిక్షణ, పట్టుదల, చిత్తశుద్ది, ప్రజలకు మంచి చేయాలనే తపనే ఒక సామాన్య రైతు బిడ్డ అయిన తారక రాముడిని మహా నాయకుడిగా తీర్చిదిద్దాయి. సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్లు అని త్రికరణ శుద్దిగా నమ్మిన ఎన్టీఆర్.. తెలుగుదేశం పార్టీ స్థాపనతో దేశంలోనే మొదటి సారిగా సంక్షేమ పాలనకు శ్రీకారం చుట్టారు. పేదవారికి కూడు, గూడు, గుడ్డ ఇవ్వడమే అధికారానికి అర్ధం అని చెప్పి, ఆచరించి చూపారు. సంక్షేమంతో పాటే అభివృద్ధికి, పాలనా సంస్కరణలకు కూడా బాటలు వేశారు. ప్రజల వద్దకు పాలనతో పాలకుడు అంటే ప్రజలకు సేవకుడు అని చాటి చెప్పారు.

ప్రజల అభ్యున్నతే సంస్కరణలకు కూడా బాటలు వేశారు. ప్రజల వద్దకు పాలనతో పాలకుడు అంటే ప్రజలకు సేవకుడు అని చాటి చెప్పారు. ప్రజల అభ్యున్నతే ఏకైక లక్ష్యంగా పని చేసిన ఎన్టీఆర్ అన్ని వర్గాల ప్రజల ఆత్మబంధువు అయ్యారు. పేదరికం లేని రాష్ట్రం కోసం, తెలుగు జాతి వైభవం కోసం తన జీవితాన్ని అంకితం చేసిన అన్న ఎన్టీఆర్ ఆశయ సాధన కోసం.. ఆయన జయంతి సందర్భంగా ప్రతి అడుగూ ప్రజల కోసం అనే సంకల్పం తీసుకుందాం” అని చంద్రబాబు రాసుకొచ్చారు.

Related posts

YSRCP: తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న వైసీపీ కేంద్ర కార్యాలయం కూల్చివేత .. బాబు సర్కార్ పై జగన్ ఆగ్రహం

sharma somaraju

AP Assembly: ఏపీ శాసనసభ స్పీకర్ గా నేడు బాధ్యతలు చేపట్టనున్న అయ్యన్న .. అనూహ్య నిర్ణయం తీసుకున్న వైసీపీ..!

sharma somaraju

Salar Jung Reforms: Important Points to Remember for TGPSC Group 1 and Group 2 Exams 2024

Deepak Rajula

YS Jagan: ఓటమితో అధైర్యపడవద్దు – క్యాడర్ కు తోడుగా నిలిచి భరోసా ఇవ్వండి: వైసీపీ నేతలకు జగన్ సూచన  

sharma somaraju

Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు .. ఇకపై కొత్త చంద్రబాబును చూస్తారంటూ..

sharma somaraju

Chirajeevi – Pawan Kalyan: చిరు ఇంటికి పవన్ .. ‘మెగా’ సంబురం

sharma somaraju

ఏపీ గవర్నర్ కు ఎన్నికైన ఎమ్మెల్యే జాబితాను అందజేసిన సీఈవో .. గెజిట్ నోటిఫికేషన్ విడుదల

sharma somaraju

Modi – Pawan Kalyan: కుటుంబ సమేతంగా మోడీని కలిసిన పవన్ కళ్యాణ్

sharma somaraju

ప్రధాని మోదీ పరిస్థితిపై కాంగ్రెస్ వ్యంగ్య చిత్రం .. సోషల్ మీడియాలో వైరల్

sharma somaraju

Manamey: మ‌న‌మే మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్‌.. హిట్ కొట్టాలంటే శ‌ర్వానంద్ ఎంత రాబట్టాలి..?

kavya N

Kajal Aggarwal: కాజ‌ల్ చేతికి ఉన్న ఆ వాచ్ ఖ‌రీదెంతో తెలుసా.. ఓ కారు కొనేయొచ్చు!

kavya N

NTR – Anushka: ఎన్టీఆర్‌, అనుష్క కాంబినేష‌న్ లో మిస్ అయిన మూడు క్రేజీ చిత్రాలు ఏవో తెలుసా?

kavya N

YS Jagan: రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయి: వైఎస్ జగన్

sharma somaraju

Rashmika Mandanna: ఎన్టీఆర్ సినిమాకు ర‌ష్మిక షాకింగ్ కండీష‌న్స్‌.. కొంచెం ఓవర్ అయినట్లు ఉంది కదా..?

kavya N

Kajal Aggarwal: నాక‌న్నా ఆ హీరోయిన్లంటేనే గౌత‌మ్ కు ఎక్కువ ఇష్టం.. భ‌ర్త‌పై కాజ‌ల్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N