Jr Ntr: జూనియర్ ఎన్టీఆర్ Jr Ntr టాలీవుడ్ లో ఉన్న స్టార్ హీరోల్లో ఒకరు. చిన్నవయసులోనే బ్లాక్ బస్టర్ హిట్స్ ఆయన సొంతం. తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ను క్రియేట్ చేసుకున్న ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస హిట్లలో ఉన్నాడు. 2015కు ముందు వరుస ఫ్లాపులు చూసిన ఎన్టీఆర్.. ఆ ఏడాది వచ్చిన టెంపర్ సినిమా నుంచి ఫ్లాపుల్లేకుండా మంచి ట్రాక్ రికార్డుతో కొనసాగుతున్నాడు. ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్న ఎన్టీఆర్ లాక్ డౌన్ నిబంధనలతో అందరిలానే ఇంట్లోనే ఉంటున్నాడు. అయితే.. ఎన్టీఆర్ ఇంట్లో ఇటివల ఓ వేడుక జరిగింది. అందుకు సంబంధించి ఎన్టీఆర్ ఓ పూజారితో కలిసి దిగిన ఫొటో నెట్టింట్లో వైరల్ అయింది.
ఈ పూజకు సంబంధించి ఓ వార్త కూడా వైరల్ అవుతోంది. ఎన్టీఆర్ చిన్న కుమారుడు భార్గవ్ రామ్ కు అక్షరాభ్యాసం చేయించినట్టు తెలుస్తోంది. ఆ సమయంలోనే ఈ ఫొటో దిగారనేది టాక్. భార్గవ్ రామ్.. 2018.. జూన్ 14న జన్మించాడు. అంటే.. ఈనెల 14తో నాలుగో ఏట అడుగుపెట్టబోతున్నాడు ఈ చిన్న ఎన్టీఆర్. ఈక్రమంలో త్వరలో నాలుగో ఏట ప్రవేశించడం.. అక్షరాభ్యాసం నాలుగులోకి రాకముందే మూడేళ్ల వయసులోనే జరిపించాలి కాబట్టి మంచి రోజు చూసి జరిపించినట్టు చెప్తున్నారు. ఎన్టీఆర్ ఈ పిక్ లో బ్లూకలర్ లాల్చీ పైజమాలో నుదుటన బొట్టుతో ఉన్నాడు. పక్కనే పూజారి కూడా ఉండటంతో ఈ కార్యక్రమమే జరిగిందని అంటున్నారు. దీంతో ఫ్యాన్స్ ఈ ఫొటోను బాగా వైరల్ చేశారు.
Read More:Ntr30: ఎన్టీఆర్30 కోసం మరో స్టార్ హీరో..! నిజమెంతో..!!
గతేడాది హోలీ సందర్భంగా ఎన్టీఆర్ పోస్ట్ చేసిన ఓ ఫోటోలో భార్గవ్ రామ్ బాగా హైలైట్ అయ్యాడు. భార్గవ్ ను చూసిన వారంతా ఇప్పుడే ఆ మోములో, చిరునవ్వులో కళ కనిపిస్తోందంటూ పొగిడేశారు కూడా. ఇప్పుడు అక్షరాభ్యాసం అయి.. అక్షరాలు కూడా మొదలెట్టేశాడు. ఇక తండ్రిలా అనర్గళంగా డైలాగులు పలకమే మిగిలిందంటూ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. ఎన్టీఆర్ ప్రస్తుతం రామ్ చరణ్ తో కలిసి ఆర్ఆర్ఆర్ తో నటిస్తున్నాడు. జూన్ ఎండింగ్ తిరిగి బ్యాలన్స్ షూటింగ్ జరుగుతుందని అంటున్నారు. ఆ తర్వాత కొరటాల శివతో కలిసి సినిమా చేయనున్నాడు.