తెలుగు సినీ ఇండస్ట్రీలో తన నటనతో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు జూనియర్ ఎన్టీఆర్. ఎన్నో సినిమాలు చేసి బాక్సాపీస్ ను బద్దలు కొట్టారు నందమూరి తారకరామారావు. ఎంత ఎదిగినా ఒదిగే ఉండాలని ఈయన మాటల్లోనే తెలుసుకోవచ్చు. ఎన్నో హిట్ సినిమాలు కొట్టి తన క్రేజ్ ను పెంచుకున్నారు జూనియర్ ఎన్టీఆర్. సినిమాలల్లో తన క్యారెక్టర్ కు పూర్తి న్యాయం చేస్తారు ఆయన. కాగా తారక్ కు ఫ్యాన్స్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు.
తన అద్భుతమైన నటనతో ఎంతో మంది ప్రజల హృదయాన్ని గెలుచుకున్నారు. కాగా తన పర్సనల్ లైఫ్ నే కాకుండా తన అన్న కళ్యాణ్ రామ్ గురించి కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని తెలుస్తోంది. కళ్యాణ్ రామ్ ఎన్నో సినిమాల్లో నటించినా హీరోగా మాత్రం అంతగా గుర్తింపును తెచ్చుకోలేకపోతున్నారు. ఈయన హీరోగానే కాకుండా, డైరెక్టర్ గా కూడా గుర్తింపు తెచ్చుకుంటున్నారు.
కాని ఏవీ పెద్దగా సక్సెన్ ను మాత్రం ఇవ్వడం లేదు. పటాస్ మూవీ పెద్ద హిట్ కొట్టిన సంగతి తెలిసిందే.. కాగా ఆ మూవీ తర్వాత వచ్చిన మూవీలు వరుసగా ప్లాప్ లీస్ట్ లో చేరాయి. దీంతో అన్నయ్య కళ్యాణ్ రామ్ గురించి ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. కాగా సినిమాలు ఎంచుకునే ముందు కథ గురించి క్లారిటీగా తెలుసుకోమని అన్నయ్యకు తారక్ సలహాఇచ్చాడని తెలుస్తోంది. అలాగే కొత్త నిర్మాతల కథలు అయినా పరవాలేదు తనకు చెప్పాలని అందరికీ చెప్పినట్టు తెలుస్తోంది.
కథ నచ్చితే ముందుగా ఎన్టీఆర్ కే చెప్పలని క్లారిటీ ఇచ్చినట్టు తెలుస్తోంది. అన్న సినిమాల చాన్స్ లు వస్తే మాత్రం వాటిని సెలెక్ట్ తానే చేస్తానని ఎన్టీఆర్ డైరెక్టర్లకు చెప్పాడని తెలుస్తోంది. కాగా ఇందుకు నిర్మాతలు కూడా పాజిటీవ్ గానే ఉన్నట్టు సమాచారం. ఎన్టీఆర్ అన్నకు మంచి మూవీని సెలెక్ట్ చేసి బాక్సాపీస్ అన్న కళ్యాణ్ రామ్ ద్వారా బద్దలు కొట్టాలని ఆలోచిస్తున్నారని అర్థమవుతోంది.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?