ఏపీ, తెలంగాణ హైకోర్టులకు జడ్జీలు వీరే!

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ హైకోర్టులకు న్యాయమూర్తులను కేటాయిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఉమ్మడి హైకోర్టును విభజిస్తూ రెండు తెలుగు రాష్ట్రాలకూ వేర్వేరుగా హైకోర్టులను ఏర్పాటు చేస్తూ నోటిఫికేషన్ విడుదలతో పాటు రెండు హైకోర్టులకూ వేర్వేరుగా న్యాయమూర్తుల కేటాయింపు కూడా జరిగిపోయింది. ఏపీకి 16 మంది, తెలంగాణకు 10 మంది న్యాయమూర్తులను కేటాయించారు. తెలంగాణ హైకోర్టు ప్రస్తుతం ఉమ్మడి హైకోర్టు ఉన్న భవనంలోనూ కొనసాగుతుంది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మాత్రం అమరావతిలో నిర్మించిన తాత్కాలిక హైకోర్టు భవనంలోకి మారుతుంది. కాగా ఏపీకి న్యాయమూర్తులుగా జస్టిస్ రమేష్ రంగనాథన్, జస్టిస్ పవన్ కుమార్, సస్టిస్ వెంకటనారాయణ, జస్టిస్ శేషసాయి, జస్టిస్ శేషాద్రి నాయుడు, జస్టిస్ సీతారామమూర్తి, జస్టిస్ దుర్గ ప్రసాద్, జస్టిస్ సునీల్ చౌదరి, జస్టిస్ సత్యనారాయణ మూర్తి, జస్టిస్ విజయలక్ష్మి, జస్టిస్ గంగారావు, జస్టిస్ శ్యాం ప్రసాద్, జస్టిస్ ఉమాదేవి, జస్టిస్ బాలయోగి, జస్టిస్ రజనీ, జస్టిస్ సోమయాజులు, జస్టిస్ వెంకటరమణలను కేటాయించారు.  అలాగే  తెలంగాణకు జస్టిస్ వెంకట సంజయ్ కుమార్, జస్టిస్ రామ చందర్ రావు, జస్టిస్ రాజశేఖర రెడ్డి, జస్టిస్ నవీన్ రావు, జస్టిస్ కోందండరాం చౌదరి, జస్టిస్ శివశంకర్ రావు, జస్టిస్ షమీమ్ అక్తర్, జస్టిస్ కేశవరావు, జస్టిస్ అభినంద కుమార్ శావిలై, జస్టిస్ అమర్నాధ్ గౌడ్ లను కేటాయించారు.

SHARE