Jr Ntr : జూనియర్ ఎన్టీఆర్ కూడా పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్నాడు అంటున్న నేత..!! ఈ విషయంలో వైసీపీ పార్టీ పెద్దలు.. షర్మిల పార్టీ అనేది ఆమె వ్యక్తిగతమని వైసిపి కి ఎటువంటి సంబంధం లేదని స్పష్టత ఇవ్వడం జరిగింది. ఇటువంటి తరుణంలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు.. కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయడం కోసం బిజెపి పార్టీ వదిలిన బాణం షర్మిల అని కొంతమంది నేతలు మరికొంతమంది కేసీఆర్ వదిలిన బాణం అని వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇటువంటి తరుణంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేత ఎమ్మెల్యే జగ్గారెడ్డి షర్మిల పార్టీ పై కీలక కామెంట్లు చేశారు. షర్మిల తప్పు చేస్తున్నారని పేర్కొన్నారు.

తెలంగాణలో పార్టీ పెట్టి పెట్టడం వల్ల వైయస్ రాజశేఖర్ రెడ్డి పేరు పాడు చేసిన వారవుతారని, తండ్రి పేరు నిలబెట్టాలి అనుకుంటే కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేయాలని సూచించారు. అంతేగాని కాంగ్రెస్ పార్టీని దెబ్బ తీయడం కోసం షర్మిల ఈ విధంగా వ్యవహరించడం సరికాదని పేర్కొన్నారు.
Jr Ntr జూనియర్ ఎన్టీఆర్ లేదా ఆయన కుటుంబంలో
అదేరీతిలో షర్మిల పార్టీపై కేసిఆర్ ఎందుకు సైలెంట్ గా ఉన్నారని.. ఎందుకు రియాక్ట్ కావటం లేదని ప్రశ్నించారు. మొత్తం పరిణామాలు చూస్తుంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయడం కోసం బిజెపి చేతిలో బాణం మాదిరిగా షర్మిల ని వాడుతున్నారని, ఆమెను మాత్రమేకాక కేసీఆర్ జగన్ పవన్ కళ్యాణ్ వీరందరినీ కూడా కాంగ్రెస్ మీద కు అమిత్ షా ఎగదోస్తూన్నారని జగ్గారెడ్డి ఆరోపించారు.తాజా పరిస్థితి చూస్తుంటే రేపోమాపో జూనియర్ ఎన్టీఆర్ లేదా ఆయన కుటుంబంలో ఎవరో ఒకరు కూడా పొలిటికల్ పార్టీ పెట్టడం గ్యారెంటీ అనే పరిస్థితులు కనిపిస్తున్నట్లు జగ్గారెడ్డి కీలక కామెంట్లు చేశారు.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని దెబ్బ తీయడం కోసం వీళ్లంతా బిజెపి పార్టీ పెద్దల డైరెక్షన్లో వస్తున్నట్లు పేర్కొన్నారు. ఉత్తర భారతంలో బిజెపి.. ఉన్న కొద్దీ పట్టు కోల్పోతున్న తరుణంలో దక్షిణాదిలో పట్టు బిగించడానికి ఇటువంటి వ్యూహాలు పనుతున్నట్లు స్పష్టం చేశారు.