జాతీయం న్యూస్

49వ సీజేఐగా ప్రమాణ స్వీకారం చేసిన జస్టిస్ యూయూ లలిత్

Share

భారత 49వ ప్రధాన న్యాయమూర్తి గా జస్టిస్ యూయూ లలిత్ ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. రాష్ట్రపతి భవన్ లో జరిగిన ఈ కార్యక్రమంలో ఉప రాష్ట్రపతి జగ్ దీప్ ధన్ ఖడ్, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, నిన్న పదవీ విరమణ చేసిన సీజేఐ ఎన్వీ రమణ, మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, పలువురు కేంద్ర మంత్రులు, న్యాయమూర్తులు, న్యాయవాదులు పాల్గొన్నారు.

మునావర్ షారుఖీకి ఢిల్లీ పోలీసులు బిగ్ షాక్

సీజేఐగా ప్రమాణ స్వీకారం చేసిన యూయూ లలిత్ 1957 నవంబర్ 9న మహారాష్ట్ర లోని షాలాపూర్ లో జన్మించారు. ఆయన వయసు 64 సంవత్సరాలు. 2014 ఆగస్టు 13న యూయూ లలిత్ సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా నియమితులైయ్యారు. న్యాయవాది నుండి సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా నేరుగా బాధ్యతలు స్వీకరించిన ఘనత ఆయనది. దేశ చరిత్రలో జస్టిస్ యూయూ లలిత్ తో పాటు మరొకరు మాత్రమే న్యాయవాది నుండి సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా అపాయింట్ అయ్యారు.

 

కాగా జస్టిస్ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా అతి కొద్ది కాలం మాత్రమే బాధ్యతలు నిర్వహించనున్నారు. యూయూ లలిత్ కేవలం రెండు నెలల 12 రోజుల (74 రోజులు) పాటు సీజేఐగా పదవీ లో కొనసాగనున్నారు. నవంబర్ 8న ఆయన పదవీ కాలం ముగుస్తుంది.

బిల్కిన్ బానో గ్యాంగ్ రేప్ కేసు: గుజరాత్ సర్కార్ కు సుప్రీం కోర్టు నోటీసు


Share

Related posts

Telangana High Court: బిగ్ బ్రేకింగ్ – తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు షాక్..! జాతీయ రహదారిపై అంబులెన్స్‌లను నిలువరించవద్దు..!!

somaraju sharma

Bank Loan: బ్యాంక్ లోన్ తీసుకున్న వ్యక్తి మరణిస్తే.. లోన్ చెల్లించనవసరం లేదా..!? చట్టాల్లో ఏముంది..!?

bharani jella

Viral: ఇలాంటి శిక్ష ఎవరికీ పడకూడదు.. మరీ 8,000 సంవత్సరాలా?

Ram