తెలంగాణలో శుక్రవారం నుంచి బతుకమ్మ సంబురాలు ప్రారంభం అయ్యాయి. బతుకమ్మ అంటేనే పూలను పూజించే పండుగ. ఎక్కడ కూడా పూలను పూజించరు. కానీ.. తెలంగాణలో మాత్రం పూలనే పూజించే పండుగ బతుకమ్మను అంగరంగవైభవంగా జరుపుకుంటారు.
బతుకమ్మ పండుగ సందర్భంగా యూట్యూబ్ లో చాలా బతుకమ్మ పాటలు దర్శనమిస్తాయి. న్యూస్ చానెళ్లు కూడా బతుకమ్మ పాటలను రిలీజ్ చేసేవి. తాజాగా బిగ్ బాస్ 3 కంటెస్టెంట్ తీన్మార్ సావిత్రి బతుకమ్మ పాటను విడుదల చేసింది.
తన అసలు పేరు శివజ్యోతి కానీ.. తీన్మార్ సావిత్రిగానే తను ఎక్కువగా ఫేమస్ అయింది. జ్యోతక్క పేరుతో శివజ్యోతి యూట్యూబ్ చానెల్ ఓపెన్ చేసింది. ప్రస్తుతం బతుకమ్మ పాటను విడుదల చేయగా… యూట్యూబ్ లో ఆ సాంగ్ టాప్ ట్రెండింగ్ లో ఉంది. ఈ పాటలో బిగ్ బాస్ 3 కంటెస్టెంట్లు.. రవి, హిమజ కూడా శివజ్యోతితో కలిసి చిందేశారు.
మీరు కూడా ఓసారి జ్యోతక్క బతుకమ్మ పాటపై లుక్కేసుకోండి మరి..
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?