Jyothakka : బిగ్ బాస్ శివజ్యోతి తెలుసు కదా. తను బిగ్ బాస్ కంటే ముందే… సావిత్రిగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది. సావిత్రి పేరుతోనే చాలారోజులు పాపులారిటీ అయ్యాక… బిగ్ బాస్ లో తనకు అవకాశం రావడంతో తన అసలు పేరు శివజ్యోతి అని తెలుగు ప్రేక్షకులకు తెలిసింది. లేకపోతే తనను ఇప్పటికీ సావిత్రి అనే పిలిచేవారు అంతా.

బిగ్ బాస్ నుంచి బయటికి వచ్చాక జ్యోతక్కకు ఆఫర్లు బాగానే వచ్చాయి. తను వీ6 నుంచి బయటికి వచ్చాక… బిగ్ బాస్ లోకి వెళ్లింది. తర్వాత టీవీ9లో జాయిన్ అయింది. ప్రస్తుతం టీవీ9లో పనిచేస్తున్న శివజ్యోతి.. తన అభిమానులతో టచ్ లో ఉండేందుకు జ్యోతక్క అనే యూట్యూబ్ చానెల్ ను స్టార్ట్ చేసింది.
Jyothakka : బ్రాండీ కాఫీ, పాన్ చాయ్ తాగిన జ్యోతక్క
తాజాగా.. హైదరాబాద్ లో ఓ హోటల్ కు వెళ్లి… స్పెషల్ చాయ్, స్పెషల్ కాఫీలను తాగేసింది జ్యోతక్క. బ్రాండీ కాఫీ తో పాటు పాన్ చాయ్ తాగి ఎంజాయ్ చేసింది.
చాలామంది విస్కీ, బ్రాండీ, వైన్ తాగరు కాబట్టి… ఆ టేస్ట్ కోసం జీరో ఆల్కాహాల్ ఉన్న బ్రాండీ కాఫీని తయారు చేస్తున్నారు. అలాగే బీరు కాఫీ, రెడ్ వైన్ కాఫీ, విస్కీ కాఫీలు కూడా ఆ హోటల్ లో తయారు చేస్తున్నారు.
వీళ్ల ఐడియాకు ఒక సలామ్ కొట్టాల్సిందే. ఇంకెందుకు ఆలస్యం… మీరు కూడా బ్రాండీ కాఫీని ఎలా తయారు చేస్తారో ఈ వీడియోలో చూడండి.