కల్వకుంట్ల చంద్రశేఖర రావు అనే నేను…

 

తెలంగాణ ముఖ్యమంత్రిగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రమాణ స్వీకారం చేశారు. కల్వకుంట్ల చంద్రశేఖరరావు అనే నేను అంటూ కేసీఆర్ దైవసాక్షిగా ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ ఆయన చేత ప్రమాణ స్వీకారం చేశారు. రాజభవ్ నలో ఈ కార్యక్రమం జరిగింది. కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేయగానే కేసీఆర్ జిందాబాద్ అంటూ నినాదాలతో ప్రాంగణం అంతా మార్మోగింది. ఈ కార్యక్రమానికి కేటీఆర్ కుటుంబ సభ్యులంతా హాజరయ్యారు. కేసీఆర్ తరువాత మహమూద్ అలీ   మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన ఉర్దూలో ప్రమాణ స్వీకారం చేశారు. మంత్రివర్గ కూర్పు అనంతరం మిగిలిన మంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తారు. ఇందుకు మరికొన్ని రోజులు పడుతుంది.