K. Vishwanath: చిరంజీవి, వెంకటేశ్, కమల్ హాసన్ లాంటి స్టార్స్ విశ్వనాథ్ గారితో తప్ప మరే దర్శకుడితోనూ ఇలాంటి సినిమాలు చేయలేదు.

Share

K. Vishwanath:  స్వయంకృషితో ఒక్కో మెట్టు ఎక్కుతూ సాగర సంగమం లాంటి చిత్ర పరిశ్రమలో కళాతపస్విగా ఆయనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు.. దర్శకులుగా, నటులు, రచయిత, సౌండ్ రికార్డిస్టు కె.విశ్వనాథ్ గారు. కాశీనాధుని విశ్వనాథ్‌ గా చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టి కె విశ్వనాథ్‌గా పాపులారిటిని సంపాదించుకున్నారు. ఆయన తీసిన సినిమాలతో తెలుగు సినిమాకు ఒక గౌరవాన్ని, గుర్తింపును తీసుకు వచ్చారు. కె.విశ్వనాథ్ మొదట సౌండ్ రికార్డిస్టుగా కెరీర్ ప్రారంభించారు. ఆ సమయంలో ప్రముఖ దర్శకులు ఆదుర్తి సుబ్బారావు పరిచయం కావడంతో ఆయన వద్ద కొన్నాళ్ళు సహాయ దర్శకుడిగా పనిచేశాడు.

k-vishwanath-stars are something special
k-vishwanath-stars are something special

అక్కినేని నాగేశ్వరరావు నటించిన ఆత్మ గౌరవం సినిమాతో విశ్వనాథ్ దర్శకుడిగా మారాడు. మొదటి సినిమాకే రాష్ట్ర ప్రభుత్వం నుంచి నంది అవార్డును సాధించారు. కె విశ్వనాథ్ మొదటి సినిమాకి గొల్లపూడి మారుతీరావు, ప్రముఖ రచయిత్రి యద్దనపూడి సులోచనారాణి, భమిడిపాటి రాధాకృష్ణ, దుక్కిపాటి మధుసూదనరావు లాంటి వారితో పనిచేయడంతో మంచి టీం ఏర్పడింది. ఆ తర్వాత కె విశ్వనాథ్ దర్శకత్వం వహించిన సిరిసిరిమువ్వ సినిమా పెద్ద విజయాన్ని సాధించడంతో చిత్ర పరిశ్రమలో విపరీతమైన గుర్తింపు తెచ్చుకున్నారు.

1978 లో కె. విశ్వనాథ్ రచన, దర్శకత్వంలో రూపొందిన సీతామాలక్ష్మి సినిమాతో మరోస్థాయికి చేరుకున్నారు. ఈ సినిమా ద్వారా తాళ్ళూరి రామేశ్వరి చిత్ర పరిశ్రమకి పరిచయమయ్యారు. కె విశ్వనాథ్ గారి కెరిర్‌లో ఓ మైల్ స్టోన్ లాంటి సినిమా అంటే శంకరాభరణం. ఇలాంటి కథతో ప్రేక్షకులను మెప్పించడం అంటే కత్తిమీద సాము చేసినట్టే. శంకరాభరణం సినిమాతో చేసిన సాహసం హర్షించదగినది, గర్వించదగినది. అందుకే ప్రతీ ఒక్కరి హృదయాలలో ఈ సినిమా ఎప్పటికి నిలిచిపోతుంది. ఈ సినిమాతోనే ఆయనకి కళాతపస్వి అని పేరు వచ్చింది.

1985 లో కమల్ హాసన్ విభిన్నమైన పాత్రలో నటించిన సినిమా స్వాతిముత్యం. రాధిక మొదటిసారి ఓ ఛాలెంజింగ్ పాత్రలో కనిపించారు. సాగరసంగమం సినిమా 511 రోజుల ఫంక్షన్ సమయంలో విశ్వనాథ్ గారి మదిలో ఈ కథ పుట్టింది. 1983 లో కమల్ హాసన్ – జయప్రద నటించిన సాగరసంగమం అఖండ విజయాన్ని సాధించింది. అప్పటి వరకు కమల్ హాసన్ నటించిన పాత్రలకు పూర్తి భిన్నంగా ఇందులో నటించారు. ఈ సినిమాలోని ప్రతీ పాట ఆణిముత్యం. అలాగే మెగాస్టార్ చిరంజీవితో విశ్వనాథ్ గారు తెరకెక్కించిన స్వయంకృషి బాక్సాఫీస్ వద్ద కొత్త లెక్కలు రాయించింది. మాస్ హీరోగా భారీ క్రేజ్ తో ఉన్న చిరంజీవితో సంచలనాత్మకమైన పాత్ర చేయించడం కేవలం విశ్వనాథ్ గారికే సాధ్యమైంది.

1986లో వచ్చిన సిరివెన్నెల సినిమా విశ్వనాథ్ గారి కెరీర్‌లో గొప్ప చిత్రం. ఈ సినిమాలో అన్ని పాటలు సీతారామ శాస్త్రి రాయడం ఒక విశేషం. ఈ సినిమాతో చేబ్రోలు సీతారామ శాస్త్రి, సిరివెన్నెల సీతారామ శాస్త్రిగా మారిపోయారు. ఇక పక్కా స్క్రిప్ట్‌తో చేసిన సినిమా శ్రుతిలయలు. రాజశేఖర్, సుమలత ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. విక్టరీ వెంకటేశ్ – భానుప్రియ జంటగా వచ్చిన స్వర్ణకమలం మరో ఆణిముత్యం లాంటి సినిమా. ఇళయరాజా సంగీతం అందించిన ఈ సినిమాలోని పాటలన్నీ సూపర్ హిట్ అవడమే కాక పలు అవార్డులను సొంతం చేసుకుంది. చిరంజీవి, వెంకటేశ్, కమల్ హాసన్ లాంటి స్టార్స్ విశ్వనాథ్ గారితో తప్ప మరే దర్శకుడితోనూ ఇలాంటి జోనర్‌లో మళ్ళీ సినిమా చేయలేదు.


Share

Related posts

క‌న్నీళ్లు పెట్టుకున్న విద్యాబాల‌న్‌

Siva Prasad

ముగ్గురు సీఎంల ప్రమాణ స్వీకారానికి మమత, మాయా గైర్హాజర్

Siva Prasad

బాల‌య్య 105 టైటిల్‌

Siva Prasad