NewsOrbit
న్యూస్

చైనా పై షాకింగ్ కామెంట్స్ చేసిన కెఏ పాల్..!!

Share

కరోనా వైరస్ ప్రపంచంలో వ్యాప్తి చెందిన నాటినుండి ప్రపంచ శాంతి పార్టీ వ్యవస్థాపకుడు కెఏ పాల్ చైనా పై విమర్శలు చేస్తూనే ఉన్నారు. చైనా ని అంతర్జాతీయ స్థాయి కోర్టు మెట్లు ఎక్కించాలని అప్పట్లో కె ఏ పాల్ ప్రపంచ దేశాలకు పిలుపు ఇవ్వటం అందరికీ తెలిసిందే. కరోనా వైరస్ బయట పడటానికి కారణం చైనా అని అప్పట్లో కెఏ పాల్ వార్తల్లో పెద్ద హాట్ టాపిక్ అయ్యారు. ఇదిలా ఉండగా తాజాగా ఇండియా మరియు చైనా బోర్డర్ మధ్య లడక్ ప్రాంతంలో చైనా కవ్వింపు చర్యలకు పాల్పడి 20 మంది భారత సైనికులను పొట్టన పెట్టుకోవడం పై కెఏ పాల్ చైనా పై షాకింగ్ కామెంట్ చేశారు.

Evangelist-turned-politician KA Paul booked for cheating woman in ...

దేశంలో చైనా కి బుద్ధి చెప్పే నాయకుడు లేకపోవడం వల్ల చైనా ఇండియా పై ఈ విధంగా రెచ్చిపోతోంది అని పేర్కొన్నారు. అసలు చైనా దేశానికి శాంతి అవసరం లేదని యుద్ధమే ముఖ్యమని…ప్రస్తుతం చైనా విషయంలో అగ్రరాజ్యం అమెరికా కూడా ఏం చేయలేని పరిస్థితి అని చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా మీడియా ముందు చైనా పై అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ విమర్శలు చేస్తున్నా గాని తెరవెనుక మాత్రం చైనాతో వ్యాపారాలు చేస్తున్నాడని ఆరోపించారు. మొత్తం మీద ప్రపంచంపై ఆధిపత్యం చెలాయించడం కోసం చైనా ప్రస్తుత వ్యవహారం ఉంది అన్నట్టుగా కెఏ పాల్ వ్యాఖ్యలు చేశారు.   


Share

Related posts

CM YS Jagan: నేడు రామానుజ సహస్రాబ్ది ఉత్సవాల్లో పాల్గొననున్న ఏపి సీఎం వైఎస్ జగన్..

somaraju sharma

Relationship మీ భాగస్వామి ఆనందం, ఆరోగ్యం మీ చేతుల్లోనే !!

Kumar

పేద దేశాలను ఆదుకోవడం కోసం కేంద్రం కీలక నిర్ణయం..!!

sekhar