Kaasara Kaya: షుగర్ పేషెంట్లకు వరం.. సైంటిస్టులనే ఆశ్చర్యపరిచిన కాసర కాయలు..!!

Share

Kaasara Kaya: కాసరకాయలు.. రాయలసీమ, కడప, కర్నూలు, అనంతపురం జిల్లా వాసులకు ఈ కాయలు సుపరిచితమే.. కాకరకాయ లానే ఇది కూడా చేదుగా ఉంటుంది.. అయితే ఇది కాకర సంతతి కాదు.. కాకరకాయలు పోషకాల గని.. ఇందులో విటమిన్లు, ప్రోటీన్లు, ఫైబర్ అధికంగా ఉన్నాయి.. కాసరకాయలను సైంటిస్టులు పరిశోధించిగా అవాక్కయ్యే నిజాలు తెలుసుకున్నారు..!!

Kaasara Kaya: Control Diabetic Levels
Kaasara Kaya: Control Diabetic Levels

సైంటిస్టులనే అవాక్కు చేసిన కాసర కాయలు..!!

కాసరకాయల పొడిలో హైపోగ్లైసమిక్ ఈ చర్య ఉంటుంది.. డయాబెటిస్ ఉన్న ఎలుకల పై ప్రయోగించారు.. వీటికి 0.25 గ్రాముల కాసరకాయల పొడి ని 15 రోజుల పాటు ఇవ్వగా.. వాటి రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిచ్చింది.. కాసరకాయల పొడి కణాల నుండి ఇన్సులిన్ ఉత్పత్తి రేటును పెంచింది.. అంతేకాకుండా హెపాటిక్ గ్లైకోజెన్ అధిక మొత్తంలో సూచించే గ్లైకోజెనిసిస్ రేటును వృద్ధి చేసింది.. ఇది చూసిన సైంటిస్టులు ఆశ్చర్యపోయారు.. డయాబెటిస్ ఉన్నవారికి కాసరకాయల పొడి అధ్భుత వరంగా చెప్పుకోవచ్చు.. ప్రతి రోజూ క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల షుగర్ లెవెల్స్ కంట్రోల్ లోకి వస్తుంది.. కాసరకాయల కూరను చాలా మంచిది ఎంతో ఇష్టంగా తింటారు. కాసరకాయలను షుగర్ పేషెంట్స్ ఏ విధంగా తీసుకున్న కూడా మంచి ఫలితాలను ఇస్తుంది..

Kaasara Kaya: Control Diabetic Levels
Kaasara Kaya: Control Diabetic Levels

మరి కొన్ని వ్యాధులకు కాసరకాయలతో చెక్..!!

ఈ కాయలలో విటమిన్ సి, బీటా కెరోటిన్, ఫైబర్, ఐరన్ సమృద్ధిగా ఉన్నాయి.. ఇది హెపటోప్రొటెక్టివ్, యాంటీ డయారోహెల్, నెఫ్రో ప్రొటెక్టివ్, యాంటీ బయోటిక్, యాంటీ మైక్రో బయాల్, యాంటీ అలర్జీ ఆక్టివిటీ, యాంటీ వైరల్ వంటి ఔషధ గుణాలు కాసరకాయలు కలిగి ఉన్నాయి.. కాస్త చేదుగా ఉండే ఈ కాయల కూర మాత్రం తినడానికి అద్భుతంగా ఉంటుంది.. విరేచనాలతో బాధపడే వారు ఈ పొడిని తీసుకుంటే త్వరగా ఉపశమనం లభిస్తుంది.. గుండె వ్యాధులు రాకుండా ఈ కాయలు మేలు చేస్తాయి.. ఇది శరీరంలోని అధిక కొవ్వును తగ్గిస్తుంది తద్వారా సులువుగా బరువు తగ్గుతారు బరువు తగ్గాలనుకునే వారికి, ఒబేసిటీతో బాధ పడేవారికి ఈ కాయలు చక్కటి ప్రత్యామ్నాయం.. కాసరకాయ మొక్క భాగాలలో మీథనాల్ సారం ఉంటుంది. ఇది ఎరిలిచ్ ఆసీట్స్ కారినోమాకు వ్యతిరేకంగా ప్రామాణిక సైక్లోప్లాస్ఫామైడి తో పోలిస్తే యాంటీ క్యాన్సర్ లక్షణాలను కలిగి ఉంటుంది.

ఈ ఆకుల రసం, పండ్ల గుజ్జు, విత్తనాలు యాంటీ హెలిమొటిక్ చర్యను కలిగి ఉన్నాయి. వీటిని మలేరియా, కోలిక్, డయాబెటిస్, ఇన్ఫెక్షన్లు, గాయాలు, నులిపురుగులకు వీటిని ఉపయోగిస్తారు. పూర్వకాలం నుండి కాసరకాయలు పొడిని కడుపు నొప్పికి కడుపు సంబంధిత వ్యాధులకు ఉపయోగిస్తున్నారు. ఇది మలబద్ధకాన్ని నివారిస్తుంది. రూమాటిక్, క్లౌట్, ప్లీహము, కాలేయ సంబంధిత వ్యాధులకు ఈ కాయలను వాడుతారు.. కాసరకాయలు ఆరోగ్యానికి ఎటువంటి ప్రయోజనాలు చేకూరుస్తాయి తెలుసుకున్నాం కదా.. ఇవి దొరికినప్పుడు కచ్చితంగా మీరు కూడా తినండి.. కాసరకాయలు జూన్, జూలై, ఆగస్టు మూడు నెలలు మాత్రమే పండుతాయి.. ఈ మూడు నెలల్లో వీటిని తినడం మంచిది.. అలాగే వీటిని ఎండబెట్టి పొడిగా చేసుకొని సంవత్సరం పాటు నిల్వ కూడా ఉంచుకోవచ్చు. ఆ పొడిని ప్రతి నిత్యం తీసుకుంటే పైన తెలిపిన  ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి..


Share

Related posts

KGF -2 release date : కేజిఎఫ్ -2 వచ్చేస్తోంది గురూ..

bharani jella

Jagan : చంద్రబాబు ప్లాన్ అమలు చేసి జగన్ హీరో అయ్యడు…! బాబు మాత్రం విలన్ అయ్యాడు

siddhu

సడలించిన లాక్ డౌన్ అయిన కనిపించని జనం

Siva Prasad