తెలుగు చిత్ర సీమలో మరో విషాదం నెలకొంది. టాలీవుడ్ సీనియర్ నటుడు, మాజీ ఎంపీ కైకాల సత్యనారాయణ (87) ఈ ఉదయం కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆయన మృతి చెందారు. హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా, కమెడియన్ గా ఇలా భిన్నమైన పాత్రలను పోషించి తనదైన గుర్తింపును సంపాదించుకున్నారు కైకాల.

1959లో సిపాయి కూతురు అనే చిత్రంతో ఈయన సినీ రంగ ప్రవేశించారు. దాదాపు 750కి పైగా చిత్రాల్లో ఆయన నటించారు. నిర్మాతగానూ సినిమాలు రూపొందించారు. కైకాల పోషించిన వైవిద్యమైన పాత్రలకు గుర్తింపుగా ఆయనకు నవరస నటనా సార్వభౌమ అనే బిరుదు ప్రధానం చేశారు. తెలుగు చిత్ర సీమలో ఎస్వీ రంగారాావు తర్వత అలాంటి వైవిద్య భరితమైన పాత్రలు పొషించిన వారిలో కైకాల ఒకరు. కైకాల మరణ వార్త తో టావీవుడ్ లో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించేందుకు పలువురు సినీ ప్రముఖులు ఆయన నివాసానికి తరలివస్తున్నారు.
కృష్ణాజిల్లా బంటుమిల్లి గ్రామంలో 1935 జులై 25న జన్మించిన కైకాల.. గుడివాడ కళాశాలలో డిగ్రీ పూర్తి చేశారు. ఆయనకు 1960 ఏప్రిల్ 10న నాగేశ్వరమ్మతో వివాహం జరిగింది. ఆయనకు ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నరు. 1996లో రాజకీయాల్లోకి వచ్చి తెలుగుదేశం పార్టీ తరపున మచిలీపట్నం నియోజకవర్గం నుండి పోటీ చేసి లోక్ సభకు ఎన్నికైయ్యారు. సినీ రంగంలో ఆయన అనేక అవార్డులు పొందారు.
కరోనా ఉదృతిపై ప్రధాని మోడీ సమీక్ష .. కీలక సూచనలు ఇవి