Kajal agarwal : చందమామ కాజల్ అగర్వాల్ సినిమా ఇండస్ట్రీకి వచ్చి 15 ఏళ్ళు అవుతోంది. ఈ 15 ఏళ్ళలో ఎన్నో అద్భుతమైన పాత్రలు చేసింది. గ్లామర్ రోల్స్ కూడా బాగానే చేసి మెప్పించింది. కాజల్ చేసిన పాత్రల్లో ఎన్నో విభిన్నమైన రోల్స్ ఉన్నాయి. అలాంటి కాజల్ ఇప్పుడు సీనియర్ స్టార్ హీరోలకి మంచి ఛాయిస్ గా మారింది. ఇప్పటికే కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆచార్య సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా దాదాపు కంప్లీట్ అయింది. ఇప్పటికే కాజల్ పాత్రకి సంబంధించిన సీన్స్ మొత్తం పూర్తయ్యాయి. ఆచార్య నుంచి కాజల్ బయటికి వచ్చేసింది.
అంతేకాదు మరో సీనియర్ స్టార్ హీరో నాగార్జున సరసన ఓ సినిమా చేస్తోంది కాజల్. కింగ్ నాగార్జున గత చిత్రం వైల్డ్ డాగ్. ఈ సినిమా కమర్షియల్ గా హిట్ కాకపోయినప్పటికి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ప్రేక్షకులు మంచి సినిమా అంటూ అభినందించారు. ఈ వయసులోనూ నాగార్జున ఇలాంటి రోల్స్ చేసేందుకు కమిట్ అవ్వడం నిజంగా అభినందనీయం అని ఇండస్ట్రీలోని ప్రముఖులు మాట్లాడారు. వైల్డ్ డాగ్ సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా నాగార్జున మాత్రం మరో యాక్షన్ అండ్ స్పై థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్ లో సినిమా చేసేందుకు కమిటయ్యాడు.
Kajal agarwal : కొన్ని సన్నివేశాలలో వేశ్యగానూ వ్యవహరిస్తుందని చెప్పుకుంటున్నారు.
ఈ సినిమాను టాలెంటెడ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో రూపొందుతోంది. నాగార్జున ఈ సినిమాలో ఎక్స్ రా ఏజెంట్ గా కనిపిస్తాడట. ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాలలో ఇది హాట్ టాపిక్ అవుతోంది. కాగా ఈ సినిమాలో కాజల్ కీలక పాత్రలో నటించబోతుంది. ఉగ్రవాదుల మధ్యలో ఉంటు వారికి సంబంధించిన విషయాలను ఇండియాకు చేరవేసే పాత్రను చేయనుందట. యాక్షన్ సన్నివేశాలలో చేయాల్సి ఉంటుందట కూడా. ఇందులో భాగంగా కొన్ని సన్నివేశాలలో వేశ్యగానూ వ్యవహరిస్తుందని చెప్పుకుంటున్నారు. చూడాలి ఇదే నిజమైతే ఈ పాత్ర కాజల్ కి ఎలాంటి క్రే తీసుకు వస్తుందో.