Kajal agarwal : దాదాపు 15 ఏళ్ళ నుంచి సక్సెస్ ఫుల్ కెరీర్‌ని కోనసాగిస్తున్నారు స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్. ఇటు తెలుగు, అటు తమిళం తో పాటు మధ్య మధ్యలో హిందీ సినిమాలను చేస్తూ సౌత్ అండ్ నార్త్ సినిమా ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలుగుతున్నారు. తన అందం, అభినయంతో మూడు చిత్ర పరిశ్రమలలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్గా ఇప్పటీకీ అదే క్రేజ్‌తో ఉన్నారు. అయితే కాజల్ గత ఏడాది పెళ్ళి చేసుకున్న సంగతి తెలిసందే. పెళ్ళికి
ముందే కొన్ని క్రేజీ ప్రాజెక్ట్స్ కమిటయింది. కానీ కరోనా వల్ల ఆమె పెళ్ళికి ముందు కమిటయిన సినిమాలన్నీ పెండింగ్‌లో పడ్డాయి. వాటిని పూర్తి చేసి ఆగిపోతుందనుకున్నారు.
కానీ కాజల్ పెళ్ళి తర్వాత కూడా కొత్త ప్రాజెక్ట్స్ కి సైన్ చేసి షాకిస్తున్నారు. ప్రస్తుతం సౌత్ లో స్టార్ హీరోయిన్ గా విపరీతమైన క్రేజ్ తో ఉన్న కాజల్ అగర్వాల్ తన భర్త కోరిన తరువాత క్షణమే సినిమాలలో నటించడం మానేస్తానంటూ సెన్షేషనల్ కామెంట్స్ చేసింది. తాజాగా సోషల్ మీడియాలో ఈ విషయాన్ని వెల్లడించి అందరికీ గట్టి షాకిచ్చింది. గత యేడాది ముంబైకు చెందిన పారిశ్రామికవేత్తను పెళ్ళి చేసుకున్న కాజల్, 2004లో బాలీవుడ్ ఇండస్ట్రీకి
పరిచయమైంది.
Kajal agarwal : నా భర్త ఈ రంగం నుంచి తప్పుకోవాలని కోరిన తక్షణమే నటనకు గుడ్‌బై చెప్పేస్తా
ఆ తర్వాత తమిళం, తెలుగు, హిందీ భాషల్లో పలు సూపర్ హిట్ సినిమాలలో నటించి స్టార్ హీరోయిన్ ఇమేజ్ను సొంతం చేసుకుంది. తమిళంలో స్టార్ హీరోలు విజయ్, అజిత్, సూర్య, ధనుష్ లాంటి వారి సరసన నటించింది. ప్రస్తుతం విశ్వనటుడు కమల్ హాసన్ తో ఇండియన్ 2లో నటిస్తోంది. తెలుగులో చిరంజీవి, నాగార్జున సినిమాలున్నాయి. మరొకవైపు వెబ్ సిరీస్‌లు కూడా చేస్తోంది. కాగా ఇన్స్టాగ్రామ్ లో ఇటీవల అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా.. ‘నేను ఎంతకాలం సినిమాలలో కొనసాగుతానో తెలియదు. నా భర్త ఈ రంగం నుంచి తప్పుకోవాలని కోరిన తక్షణమే నటనకు గుడ్‌బై చెప్పేస్తా.. అంటూ షాకింగ్ ఆన్సర్ ఇచ్చింది.