Kajal Aggarwal : “లక్ష్మీకళ్యాణం” సినిమాతో సినిమా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన కాజల్ అగర్వాల్ Kajal Aggarwal అతి తక్కువ కాలంలోనే తనకంటూ సెపరేట్ క్రేజ్ క్రియేట్ చేసుకుంది. రెండో సినిమా రాజమౌళి దర్శకత్వంలో “మగధీర” నటించి ఇండస్ట్రీ హిట్ అందుకొని ఇండస్ట్రీలో ఆల్ మోస్ట్ ఆల్ అందరి హీరోల పక్కన నటించడం జరిగింది. తెలుగులో మాత్రమే కాక సౌతిండియాలో సత్తా చాటిన అగర్వాల్ బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా రాణించడం జరిగింది. అయితే ఎక్కువగా బాలీవుడ్ ఇండస్ట్రీ పైనే ఫోకస్ పెట్టడంతో….అప్పట్లో సౌత్ సినిమాలు చేసే అవకాశం వచ్చిన చిన్న చూపు చూడడం జరిగింది. దీంతో ఈ అమ్మడుకి బీ టౌన్ లో మొదటిలో విజయాలు దక్కిన గాని తర్వాత వరుస ఫ్లాపులు రావటంతో.. మళ్లీ లైఫ్ ఇచ్చిన సౌత్ వైపు చూసి ప్రస్తుతం సక్సెస్ ఫుల్ గా సినిమాలు చేస్తూ ఉంది.
ఇదిలావుంటే ఇటీవల కాజల్ అగర్వాల్ పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. స్నేహితుడు బిజినెస్ మెన్ గౌతమ్ కిచ్లుని గత ఏడాది ముంబయిలో అతి తక్కువ బంధువుల సమక్షంలో పెళ్లి చేసుకోవడం జరిగింది. అయితే పెళ్లి అయినా గాని కాజల్ అగర్వాల్ సినిమా ఇండస్ట్రీకి దూరం అవ్వకుండా ఎప్పటిలాగానే ఒకపక్క పెళ్లి జీవితం మరోపక్క ప్రొఫెషనల్ జీవితం బ్యాలెన్స్ చేసుకుంటూ రాణిస్తుంది. ఇటువంటి తరుణంలో ఇండస్ట్రీకి అదేవిధంగా అభిమానులకు షాక్ ఇచ్చే రీతిలో సోషల్ మీడియాలో తన పేరు మార్చుకుంది. మేటర్ లోకి వెళ్తే తన ఇన్స్టాగ్రామ్ ఫ్రొఫైల్లో భర్త పేరు కలిసి వచ్చేలా పేరుని కాజల్ ఎ కిచ్లు అని మార్చుకుంది. చిరంజీవి నటిస్తున్న అనే సినిమాలో హీరోయిన్ గా చేస్తున్న కాజల్ అగర్వాల్ ‘లైవ్ టెలికాస్ట్’ అనే వెబ్ సిరీస్ ద్వారా డిజిటల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చింది. ఇదిలా ఉంటే భర్త పేరు తన పేరు చివర పెట్టుకోవడంతో సోషల్ మీడియాలో నెటిజన్లు ఆమె అభిమానులు … కాజల్ కి భర్తపై గౌరవం పెరిగిపోయింది అంటూ కామెంట్లు పెడుతున్నారు.