టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో అనుష్క తర్వాత సీనియర్ హీరోయిన్ అంటే కాజల్ అగర్వాల్. ఈ బ్యూటీ టాలీవుడ్ ..కోలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఇప్పటికీ క్రేజ్ తోనే ఉంది. ఒకవైపు సీనియర్ స్టార్ హీరోల సినిమాలు చేస్తూనే మరో యంగ్ హీరోల సినిమా ఆఫర్స్ ని వదలడం లేదు. ఇక ప్రస్తుతం కాజల్ అగర్వాల్ చేస్తున్న సినిమాలన్ని పాన్ ఇండియా సినిమాలు కావడం విశేషం. ఇది చాలామందికి షాకింగ్ విషయం. ఎందుకంటే ఇక కాజల్ అగర్వాల్ ఫేడౌట్ అవుతుంది ..సినిమాలు ఏమీ లేవు అనుకున్న ప్రతీసారి వరసగా మూడు నాలుగు ప్రాజెక్ట్స్ లో ఛాన్స్ అందుకొని షాకిస్తోంది.
ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఆచార్య సినిమాలో చిరంజీవికి జంటగా నటిస్తోంది. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా కొణిదెల ప్రొడస్క్షన్స్ బ్యానర్ పై రాం చరణ్ నిర్మిస్తున్నాడు. అలాగే మంచు విష్ణు నటిస్తూ, నిర్మిస్తున్న మోసగాళ్ళు అన్న పాన్ ఇండియా సినిమాలోను కాజల్ నటిస్తుంది. అయితే ఈ సినిమాలో కాజల్ విష్ణు కి సోదరి పాత్రలో నటించడం ఆసక్తికరమైన విషయం. ఈ సినిమాలతో పాటు తనని టాలీవుడ్ కి అరిచయం చేసిన దర్శకుడు తేజ దర్శకత్వంలో రూపొందనున్న అలిమేలుమంగ వెంకటరమణ సినిమాలో కూడా కాజల్ నటించే అవకాశాలున్నాయని అంటున్నారు.
ఇక తమిళంలో శంకర్ కమల్ హాసన్ కాంబినేషన్ లో రూపొందుతున్న ఇండియన్ 2 లో హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా కూడా పాన్ ఇండియన్ సినిమా. అలాగే రీసెంట్ గా ఒక వెబ్ సిరీస్ లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రముఖ తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు ఈ వెబ్ సిరీస్ కి దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం కాజల్ చేతిలో ఉన్న సినిమాలు వెబ్ సిరీస్ తో రెండేళ్ళ వరకు బిజీగా ఉందట. కాజల్ కి సినిమాలు లేవని ఇక తన పనైపోయిందని అనుకున్న ప్రతీసారి ఇలా రెండేళ్ళకి సరిపడా ప్రాజెక్ట్స్ చేతిలో పెట్టుకొని షాకిస్తుంది.