బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజోల్ తన గ్లామర్, నటనతో చిత్ర పరిశ్రమను ఓ ఊపు ఊపింది. దిల్వాలే దుల్హనియా లేజాయేంగే, బాజీగర్, కుచ్ కుచ్ హోత హై వంటి సినిమాల్లో నటించి బాగా పాపులర్ అయింది. ఈమె 1990వ దశకంలో తీసిన సినిమాలు ప్రేక్షకులను బాగా అలరించాయి. కాజోల్ సినిమాలు తెలుగులోనూ విడుదల అయ్యాయి. తను నటించిన మెరుపు కలలు మూవీ ఘనవిజయం సాధించింది. 1999లో కెరీర్ పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడే హీరో అజయ్ దేవ్‌గన్‌ను పెళ్లి చేసుకుంది. మోస్ట్ సక్సెస్ ఫుల్ బాలీవుడ్ యాక్టర్స్ గా పేరు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ మ్యారేజ్ అయిన కొంత కాలం సినిమాలకు దూరంగా ఉంది. మంచి అవకాశాలు వస్తే అప్పుడప్పుడు సినిమాల్లో నటిస్తూ వస్తోంది.
ఒక్క ఎపిసోడ్‌కే రూ.5 కోట్లు
బాలీవుడ్ స్టార్లు రెమ్యునరేషన్ తో పాటు రెంట్లు కూడా భారీగా లాగుతున్నారట!
అయితే తాజాగా కాజోల్ ఓ వెబ్‌సిరీస్‌లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. డిస్నీ హాట్‌స్టార్‌లో ప్రసారం కాబోతున్న ఈ థ్రిల్లర్ సిరీస్ కు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ కూడా పూర్తి అయిపోయాయి. కాగా జులై 11 నుంచి షూటింగ్ జరగనుంది. తాజాగా ఈ వెబ్ సిరీస్ కి సంబంధించిన ఓ ఆసక్తికర వార్త బాలీవుడ్ టౌన్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ వెబ్ సిరీస్ లో నటించేందుకు కాజోల్ ఒక్క ఎపిసోడ్ కు రూ.5 కోట్లు ఛార్జ్ చేస్తోందట. ఈ వార్త బాలీవుడ్ టౌన్లో విస్తృతంగా చక్కర్లు కొడుతోంది. ఇంకా టైటిల్ ఖరారు కాని ఈ వెబ్ సిరీస్ కు సూపర్న్ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు.
మాములు క్రేజ్ కాదు
కాజోల్ ఇప్పటి తరం హీరోయిన్ కాదు. అయినా కూడా ఆమె డిమాండ్ ఏ మాత్రం తగ్గలేదు. అందుకే హాట్‌స్టార్ షో కేవలం ఒక్క ఎపిసోడ్‌కి రూ.5 కోట్లు ఇచ్చేందుకు అంగీకరించింది. అంటే ప్రస్తుత స్టార్ హీరోయిన్లకు ఏమాత్రం తగ్గకుండా ఆమె పారితోషికం పుచ్చుకుంటోంది. ఇది నిజంగా ఆశ్చర్యపోవాల్సిన సంగతేనని బాలీవుడ్ వర్గాలు కూడా చెవులు కొరుక్కుంటున్నాయి. ఇక 2017లో ఆమె వీఐపీ 2లో బాగా నటించి చాలా మంది ప్రశంసలు దక్కించుకుంది.