Kakinada Municipal corporation: కాకినాడలో వైసీపీ కీలక అడుగులు..! మేయర్ పీఠంకు కౌంట్ డౌన్..!!

Share

Kakinada Municipal corporation: తూర్పు గోదావరి జిల్లా కాకినాడ మున్సిపల్ కార్పోరేషన్ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ప్రస్తుతం ఇక్కడ ఎన్నికలు లేకపోయినా మేయర్ పీఠం పై అధికార వైసీపీ దృష్టి సారించడంతో రాజకీయ వాతావరణ వేడెక్కుతోంది. ప్రస్తుత మేయర్ గా టీడీపీ నేత సుంకర పావని ఉన్నారు. ఆమె పదవి బాధ్యతలు చేపట్టి ఈ నెల 15వ తేదీతో నాలుగేళ్లు అవుతోంది. మేయర్ మార్పు ముహూర్తంగా కోసం ఎదురుచూస్తున్న వైసీపీ అందుకు అనుగుణంగా అడుగులు వేస్తుండటంతో కొత్త మేయర్ ఎవరు అవుతారు అన్నది హాట్ టాపిక్ గా మారింది.

Kakinada Municipal corporation ysrcp politics
Kakinada Municipal corporation ysrcp politics

రాష్ట్రంలో అధికార మార్పుతో కాకినాడ కార్పోరేషన్ లో వైసీపీ బలం పెరిగింది. 2017 లో కాకినాడ మున్సిపల్ కార్పోరేషన్ కు ఎన్నికలు జరగ్గా టీడీపీ అత్యధిక స్థానాలు కైవశం చేసుకోవడంతో కాపు సామాజిక వర్గానికి చెందిన సుంకర పావని మేయర్ గా ఎన్నికైయ్యారు. అయితే 2019 అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి రావడంతో ఆ ప్రభావం కాకినాడ కార్పోరేషన్ పై పడింది. 32 టీడీపీ కార్పోరేటర్ లలో అత్యధికులు వైసీపీకి జంప్ అయ్యారు. దీంతో వైసీపీ బలం 35కి చేరింది. తమకు 35 మంది కార్పోరేటర్ల బలం ఉన్నట్లు స్వయంగా ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. ఇటీవల జరిగిన రెండో డిప్యూటి మేయర్ ఎన్నికల్లో ఆ స్థానాన్ని వైసీపీ కైవశం చేసుకుంది. ఇప్పుడు మేయర్ పీఠంపై దృష్టి పెట్టింది వైసీపీ.

ఈ క్రమంలోనే రూ.38 కోట్ల స్మార్ట్ సిటీ నిధులతో కాకినాడ కార్పోరేషన్ కొత్త భవనం పనుల ప్రారంభోత్సవ కార్యక్రమం వాయిదా పడుతూ వచ్చింది. ఈ పనులకు 15వ తేదీ శంకుస్థాపన చేయాల్సి ఉన్నా మేయర్ మార్పు తరువాత ఈ కార్యక్రమం నిర్వహించాలన్న భావనతో వాయిదా వేసినట్లు సమాచారం. ఈ నెల 15 తరవాత మేయర్ సుంకర పావని పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి వైసీపీ మహిళా కార్పోరేటర్ ను ఆ స్థానంలో ఎన్నిక చేయాలని వైసీపీ అంతర్గత రాజకీయం చేస్తుంది. అధికార వైసీపీ కూడా కాపు సామాజిక వర్గ మహిళా నేతనే మేయర్ కు ఎంపిక చేస్తారని ప్రచారం జరుగుతోంది. కార్పోరేషన్ పై వైసీపీ జెండా ఎగరవేసిన తరువాతే కొత్త భవనం శంకుస్థాపన పనులు ప్రారంభిస్తారని టాక్. ఇప్పుడు మేయర్ స్థానాన్ని కైవశం చేసుకుంటే ఏడాది తరువాత జరిగే ఎన్నికల నాటికి పూర్తి స్థాయిలో పాగా వేయవచ్చనే ఆలోచనలో అధికార వైసీపీ ఉంది. దీంతో ఈ నాలుగు రోజుల్లో జరిగే పరిణామాలు చర్చనీయాంశం అవుతున్నాయి.


Share

Related posts

తీవ్ర ఒత్తిడిలో సీఎం జగన్..! రంగంలోకి రాష్ట్రపతి కార్యాలయం..!

somaraju sharma

కౌంటింగ్ ఏర్పాట్లపై సిఎస్ సమీక్ష

sarath

Lover Suicide Attempt: భగ్న ప్రేమికుడి ఆత్మహత్యాయత్నం..! సోషల్ మీడియాలో సెల్ఫీ వీడియో..! ఆ తరువాత ఏమైందంటే..?

somaraju sharma