న్యూస్ సినిమా

Kalaavathi Song Out : సర్కారు వారి పాట మూవీ నుంచి కళావతి సాంగ్ రిలీజ్… మహేష్ ఫ్యాన్స్ ఫిదా!

Kalaavathi song
Share

Kalaavathi Song Out : ప్రిన్స్ మహేష్ బాబు, మహానటి ఫేమ్ కీర్తి సురేష్ హీరో హీరోయిన్లుగా.. పరుశురామ్ దర్శకత్వంలో ‘సర్కారు వారి పాట’ అనే సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాపై మహేష్ బాబు అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే SVP మూవీ మేకర్స్ ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డే సందర్భంగా కళావతి (Kalaavathi) అనే సాంగ్ విడుదల చేయాలనుకున్నారు. కానీ కొందరు ఈ పాటను లిరికల్ రూపంలో సోషల్ మీడియాలో ముందుగానే అనధికారికంగా లీక్ చేశారు. దీంతో సినిమా బృందం ఒకరోజు ముందుగానే అంటే తాజాగా ఈ పాటను రిలీజ్ చేయాల్సి వచ్చింది. యూట్యూబ్ లో విడుదలైన ఈ పాట ప్రస్తుతం మహేష్ బాబు ఫ్యాన్స్ ని ఖుషి చేస్తోంది. ఇందులోని విజువల్స్ చూసి ప్రిన్స్ అభిమానులు ఫిదా అవుతున్నారు.

Kalaavathi Song Out : మనసులు దోచేస్తున్న కళావతి పాట

 

kalaavathi song

ఈ పాటను సిద్ధ్ శ్రీరామ్ అత్యంత మధురంగా ఆలపించాడు. గీతామాధురి, రమ్య బెహరా, మోహన భోగరాజు, సాహితీ చాగంటి, పద్మజ శ్రీనివాసన్ ఇలా చాలామంది సింగర్లు మనసుని హత్తుకునే విధంగా కోరస్ అందించారు. ఎస్.ఎస్.తమన్ సంగీత బాణీలు సమకూర్చాడు. ఈ మ్యూజిక్ కమ్ సాంగ్ మేకింగ్ వీడియో చూసేందుకు చాలా అద్భుతంగా అనిపించింది. ఈ పాటను ఒక మాస్టర్ పీస్ గా తీర్చిదిద్దడానికి చాలామంది మ్యూజిషియన్లు పాల్గొన్నారని తెలుస్తోంది. ఒక ఫెస్టివల్ వైబ్స్ తీసుకొచ్చేలా ఉందీ పాట. కీర్తి సురేష్, మహేష్ బాబు కెమిస్ట్రీ కూడా అదిరిపోయింది. ఈ మ్యూజిక్ వీడియోలోని అక్కడక్కడా వచ్చిన చిన్న వీడియో క్లిప్‌ల్లో మహేష్ బాబు డ్యాన్స్‌లు అద్భుతంగా అనిపించాయి. ఇది యూట్యూబ్ లో రిలీజ్ అయిన ఒక గంట సమయంలోనే మిలియన్ వ్యూస్ సంపాదించింది.

సినిమా విడుదల అప్పుడే!

kalaavathi song

పరశురామ్ దర్శకత్వం వహిస్తున్న సర్కారు వారి పాట షూటింగ్ చివరి దశలో ఉంది. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. సర్కారు వారి పాట మే 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.


Share

Related posts

CDS: త్రివిధ దళాపతిగా బాధ్యతలు చేపట్టిన ఆర్మీ చీఫ్ జనరల్ నరవాణే

somaraju sharma

Padma Awards: కొత్త సంప్రదాయానికి తెరతీసిన ప్రధాని మోడీ..! ఇదీ మోడీ మార్క్..!!

somaraju sharma

ఇండియా ఇంకా విదేశాలలో కొత్త వ్యాపారం స్టార్ట్ చేయబోతున్న ప్రభాస్..??

sekhar