నందమూరి ఫ్యామిలీ నుంచి సినీ రంగ ప్రవేశం చేసిన నటసింహం నందమూరి బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే సినీ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లగలుగుతున్నారు. అదే కుటుంబం నుంచి వచ్చిన కళ్యాణ్ రామ్ మాత్రం ప్రేక్షకుల అభిమానాన్ని పొందడానికి విఫల ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ హీరో నటించిన సినిమాలు చాలా వరకు ఫ్లాప్ అయ్యాయి. మూడు చిత్రాలు మాత్రం సూపర్ హిట్స్‌గా నిలిచాయి. ఆ మూడు సినిమాల్లో ఒక కామన్ పాయింట్ ఉండటం విశేషం. తాజాగా ఇంట్రెస్టింగ్ విషయం గురించి నెటిజన్లు చర్చించుకుంటున్నారు. ఆ కామెంట్ పాయింట్ వల్లే ఆ మూడు సినిమాలు హిట్ అయ్యాయని అంటున్నారు. మరి ఆ కామెంట్ పాయింట్ ఏంటి?
ఆ మూడు చిత్రాలు సూపర్ హిట్
కళ్యాణ్ రామ్ కెరీర్లో పటాస్, అతనొక్కడే, బింబిసారా అనే మూడు మూవీలు ఫ్యాన్స్ గర్వించదగిన స్థాయిలో హిట్టయ్యాయి. ఈ మూడు సినిమాలు కళ్యాణ్ రామ్ కు మంచి పేరు తెచ్చిపెట్టాయి. అయితే ఇటీవలే రిలీజ్ అయిన బింబిసార మూవీ ఇప్పటికే 22 కోట్ల రూపాయల కలెక్షన్స్ వసూలు చేసింది. సినిమా ఫుల్ రన్ టైమ్‌లో 30 కోట్లు కూడా దాటే అవకాశాలు ఉన్నాయి.
ఆ పాయింట్ ఉంటే బొమ్మ బ్లాక్ బస్టరేనా?
‘అతనొక్కడే’ చిత్రంలో కళ్యాణ్ రామ్ కొంతమందిని చంపుతూ ఒక విలన్ లాగా అందర్నీ భయపెడుతూ ఉంటాడు. ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తే అందులో కళ్యాణ్ రామ్ అలా చేయడానికి గల కారణాలు తెలుస్తాయి. ఇక ‘పటాస్’ మూవీ విషయానికి వస్తే అందులో కూడా కళ్యాణ్ రామ్ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తాడు. ఆ తర్వాత వచ్చిన కొన్ని మార్పులతో మంచి పోలీస్ ఆఫీసర్ గా మేపిస్తాడు. ఇక ‘బింబిసార’ సినిమాలో కూడా అదే రిపీట్ అయింది. బింబిసార సినిమాలో కూడా క్రూరమైన రాజు పాత్రలో కనిపించి ఆ తరువాత మితిమీరిన అహంకారంతో ఉన్న హీరోలా మారిపోతాడు. జీవితంలో చోటు చేసుకునే కొన్ని సంఘటనలతో మార్పు వచ్చి మంచిగా మారిపోతాడు. అలాంటి నెగటివ్ షేడ్స్‌తో వచ్చిన బింబిసార సినిమా కళ్యాణ్ రామ్ కెరీర్ లో ఒక మైలురాయిగా నిలిచిపోయింది.
అయితే కళ్యాణ్ రామ్ కెరీర్ లో హిట్ అయిన ఈ మూడు సినిమాలలో అతను మొదట నెగిటివ్ క్యారెక్టర్ లో నటించి ఆ తర్వాత మంచిగా మారుతాడు. దాంతో కళ్యాణ్ రామ్ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించడం వల్ల సినిమాలు హిట్ అవుతున్నాయని ఫ్యాన్స్ అంటున్నారు. నెక్స్ట్ తీయబోయే సినిమాల్లో కూడా ఇలాంటి పాత్రలు ఎంచుకోమని సలహాలు ఇస్తున్నారు కొంతమంది. ఇదిలా ఉండగా కళ్యాణ్ రామ్ నెక్స్ట్ నటించబోయే ‘డేవిడ్ ‘ సినిమాపై భారీగా హోప్స్ పెట్టుకున్నారు అభిమానులు.