Kamal haasan: ఇటీవల తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసి ఓడిపోయిన కమలహాసన్.. ఒక పక్క సినిమాలు చేస్తూనే మరో పక్క రాజకీయంగా ఎక్కడా తగ్గడం లేదు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల టైంలో ప్రచారంలో హోరెత్తించిన కమల్ పార్టీ.. ఓట్లు రాబట్టడంలో విఫలమయ్యింది. అంతకు ముందు పార్లమెంట్ ఎన్నికలలో ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికలలో కూడా కమల్ పార్టీ ఒక్క స్థానాన్ని కూడా గెలవలేక పోయింది.
ఈ క్రమంలో ప్రస్తుతం కమల్ పార్టీలో ఉన్న చాలామంది నాయకులు ఇతర పార్టీలోకి జంప్ అవుతున్నారు. మరోపక్క కమల్ పార్టీ ఎత్తేస్తారు అన్న వస్తున్న వార్తలకు.. ఎట్టి పరిస్థితుల్లోనూ వెనుకడుగు వేసే ప్రసక్తి లేదు, చివరి వరకు ప్రజల కోసం పోరాడుతాం అంటూ ఓడిపోయిన తర్వాత కమల్ హాసన్ క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఒకపక్క శంకర్ దర్శకత్వంలో భారతీయుడు సీక్వెల్ సినిమా ఇండియన్ 2 చేస్తున్న కమల్ మరోపక్క సంచలన డైరెక్టర్ లోకేష్ కనకరాజు దర్శకత్వంలో “విక్రమ్” అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.
Read more: Kamal Hassan: “దృశ్యం” సీక్వెల్ విషయంలో సంచలన నిర్ణయం తీసుకున్న కమలహాసన్..!!
ఈ సినిమాలో చాలా డిఫరెంట్ గెటప్ లలో కమల్ హాసన్ నటిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమాకి సంబంధించి ఫస్ట్ లుక్ రేపు సాయంత్రం రిలీజ్ చేయనున్నట్లు.. డైరెక్టర్ లోకేష్ కనకరాజు సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. వైవిద్యమైన స్క్రిప్ట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా.. స్టోరీ..లో కమల్ గెటప్ ఎలా ఉంటుందో అన్న ఉత్కంఠలో ఉన్న అభిమానులకు రేపు.. ఫస్ట్ లుక్ ద్వారా సర్ ప్రైజ్ భారీగా సినిమా యూనిట్ ప్లాన్ చేసినట్లు సమాచారం. దాదాపు చాలా కాలం తర్వాత కమలహాసన్ సినిమాకి సంబంధించి అప్డేట్ రావడంతో సంతోషంలో ఉన్నారు కమల్ అభిమానులు. రాజకీయంగా సక్సెస్ సాధించకపోయినా సినిమా పరంగా మాత్రం కమల్ హాసన్ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు.
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!