న్యూస్ రాజ‌కీయాలు

రజినీకాంత్ సపోర్ట్ కోరిన కమల్ హాసన్ మాజీ జీవిత భాగస్వామి..!!

Share

త్వరలో తమిళనాడు రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అధికార ప్రతిపక్ష పార్టీలతో పాటు కమలహాసన్ పార్టీ మరియు ఇంకా మరికొన్ని పార్టీలు ఎన్నికల్లో సత్తా చాటాలని అనేక వ్యూహాలు వేసుకుంటూ ఉన్నాయి. ఇదిలా ఉండగా ఈ సారి బిజెపి తమిళనాడులో ఎలాగైనా పాగా వేయాలని.. ఇదే కరెక్ట్ టైమ్ అని భావిస్తూ ఉంది.

No contact with Kamal Haasan since we parted ways: Gautami - The Hinduఈ క్రమంలో తమిళ్ ఓటర్లు ఎక్కువగా ఆదరించే సినిమా వాళ్లను పార్టీలో జాయిన్ చేసుకుంటూ తమిళం బిజెపి వ్యవహరిస్తోంది. ఇదిలా ఉంటే కమల్ హాసన్ మాజీ జీవిత భాగస్వామి గౌతమి.. బిజెపి తరఫున ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇటీవల ప్రచారంలో భాగంగా విరుదునగర్ దక్షిణ జిల్లా నేతలు శ్రీవల్లిపుత్తూర్ లో నిర్వహించిన భారీ బహిరంగ సభలో ఆమె పాల్గొని కీలక వ్యాఖ్యలు చేసింది.

 

రజనీకాంత్ రాజకీయాల్లోకి రాను అంటూ పార్టీ పెట్టే ప్రసక్తే లేదంటూ తేల్చి చెప్పారు. అయితే రాబోయే ఎన్నికల్లో బిజెపికి సపోర్ట్ ఇవ్వాలని రజినీకాంత్ ని ఈ సందర్భంగా గౌతమి కోరింది. తమిళనాడు రాష్ట్రంలో ఇప్పుడిప్పుడే బీజేపీ పార్టీ బలోపేతం అవుతుందని ఈ విషయంలో రజినీకాంత్ అడుగువేస్తే మరింత బలోపేతం అయ్యే అవకాశం ఉందని స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా రాజ్యపాళ్యం నియోజకవర్గం నుండి పోటీచేసే విషయంపై పార్టీ హైకమాండ్ తీసుకునే నిర్ణయమే తన నిర్ణయం అని తెలిపింది. ప్రస్తుతం మాత్రం పార్టీ ప్రచార కార్యక్రమాల బాధ్యతలు మాత్రమే ఇచ్చినట్లు స్పష్టం చేసింది. ఏది ఏమైనా కమల్ హాసన్ మాజీ భార్య బిజెపికి సపోర్ట్ చేయాలంటూ రజినీకాంత్ ని వేడుకోవడం ఇప్పుడు తమిళ రాజకీయాల్లో మాత్రమే కాక దేశవ్యాప్తంగా సంచలనం అయింది. ఎందుకంటే జరగబోయే ఎన్నికలలో కమల్ హాసన్ పార్టీ కూడా పోటీ చేస్తూ ఉంది. ఇలాంటి తరుణంలో గౌతమి ఈ రీతిలో కామెంట్లు చేయడం పెద్ద చర్చనీయాంశంగా మారింది.


Share

Related posts

Romance: మీ భాగస్వామి శృంగారం మీద ఆసక్తి చూపడం లేదా?? అయితే మీరు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయాలు ఇవే !!

siddhu

KCR: 50000 ఉద్యోగాల భ‌ర్తీ… సంచ‌ల‌న తీపిక‌బురు చెప్పిన కేసీఆర్‌

sridhar

Vizag Politics : విశాఖలో గెలుపెవరిది..!? వైసీపీకి ఎక్కడ దెబ్బ పడింది.!? “న్యూస్ ఆర్బిట్” ప్రత్యేకం..!!

Srinivas Manem
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar