Kamal Hassan: ఊపిరి ఉన్నంతవరకూ రాజకీయాల్లోనే..! కమల్ క్లారిటీ..

kamal hassan clarity on politics
Share

Kamal Hassan: కమల్ హాసన్ Kamal Hassan సినిమాల్లో సూపర్ స్టార్. దశాబ్దాల సినీ ప్రయాణంలో ఎన్నో విలక్షణమైన పాత్రలు చేసి ప్రేక్షకుల్ని మెప్పించారు. రెండేళ్ల క్రితమే రాజకీయాల్లోకి వచ్చారు. కరుణానిధి, జయలలిత మరణానంతరం రాజకీయ శూన్యత ఉందన్న నేపథ్యంలో ఆయన ‘మక్కల్ నీద మయ్యం’ అనే పార్టీ స్థాపించి ప్రజల్లోకి వచ్చారు. తొలుత 2019 పార్లమెంట్ ఎన్నికల్లో కొన్నిచోట్ల పోటీ చేసి విఫలమయ్యారు. రీసెంట్ గా జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో కూడా పోటీ చేశారు. అయితే.. అనూహ్యంగా ఆయనతోసహా పార్టీ కూడా ఘోర పరాజయం చవిచూసింది. దీంతో ఆయన పాలిటిక్స్ కు గుడ్ బై చెప్పేస్తారనే ఊహాగానాలు తమిళనాడులో ఊపందుకున్నాయి. దీనిపై ఆయన క్లారిటీ ఇచ్చారు.

kamal hassan clarity on politics
kamal hassan clarity on politics

‘నా ఊపిరి ఉన్నంతవరకూ రాజకీయాల్లోనే ఉంటాను. ఎన్నికల్లో ఓడిపోయినంత మాత్రాన వెనకడుగు వేసే ప్రసక్తే లేదు. నేను రాజకీయాల నుంచి వైదొలగి మళ్లీ సినిమాలు మాత్రమే చేస్తాననే వార్తల్లో వాస్తవం లేదు. వ్యవస్థ, రాజకీయాలు ఉన్నంతవరకూ మక్కల్ నీది మయ్యం ఉంటుంది. పార్టీ నుంచి వెళ్లిపోయిన వారి గురించి మాట్లాడదలచుకోలేదు. మక్కల్ నీది మయ్యం కొందరు సామాన్యుల్ని కూడా నాయకుల్ని చేసింది. పార్టీ నుంచి వెళ్లిపోయినవార్ని మళ్లీ పార్టీలోకి చేర్చుకునే ప్రసక్తే లేదు. పొత్తులు కుదుర్చున్నప్పుడు ఒక్కరూ మాట్లాడలేదు. ఫలితాలు ఎలా ఉన్నా స్వీకరించగలగాలి. తప్పులను ఎత్తి చూపేందుకు కారణాలు వెతుక్కోవడం సరికాదు. నాపై ఆరోపణలు చేస్తున్నవారిపై స్పందించాల్సిన అవసరం లేదు. పార్టీ ఇకపై మరింత యాక్టివ్ అవుతుంది’ అని అన్నారు.

Read More: YS Jaganmohan Reddy: 2024 టార్గెట్..! చంద్రబాబు చేసిన తప్పు.. జగన్ చేస్తారా..!?

కమల్ పార్టీ ఎన్నికల్లో ఓటమి అనంతరం చాలామంది పార్టీ వీడారు. కమల్ నియంతృత్వ ధోరణి భరించలేమంటూ కామెంట్లు చేసి మరీ వెళ్లిపోయారు. దీంతో కమల్ మౌనం వహించారు. దీంతో రాజకీయాలకు గుడ్ బై చెప్తారనే ఉహాగానాలకు ఆయన ఒక వీడియో సందేశం ద్వారా చెక్ పెట్టారు. రాజకీయాల నుంచ వైదొలిగేది లేదని స్పష్టం చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో కమల్ పార్టీకి 3.7 శాతం ఓట్లు వస్తే.. అసెంబ్లీలో 3 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. స్వయంగా కమల్ కూడా కోయంబత్తూరు దక్షిణ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్ధి వానతి శ్రీనివాసన్ చేతిలో ఓడిపోయిన సంగతి తెలిసిందే.

 


Share

Related posts

YS Jagan : జగన్ ను ఫాలో అవుతున్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్..!

siddhu

అదిగదిగొ కరోనా టీకా..! కీలక దశలో

Vissu

ఉగ్రదాడి ప్రతిఘటనకు అఖిలపక్ష సంపూర్ణ మద్దతు

somaraju sharma