33.7 C
Hyderabad
March 31, 2023
NewsOrbit
న్యూస్ సినిమా

ఇండియన్ 2 కి పోటీగా కమల్ మరో సినిమా ..ఇది పక్కా ఆయన ప్లానే అంటున్నారు ..?

Share

కమల్ హాసన్ ఇంతక ముందే ఒక సినిమాని ప్రకటించాడు. కోలీవుడ్ స్టార్ హీరో కార్తీతో ‘ఖైదీ’ వంటి హిట్ ని తెరకెక్కించిన లోకేష్ కనగ్ రాజ్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే మరో కోలీవుడ్ స్టార్ విజయ్ తో ‘మాస్టర్’ అన్న భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ ని తెరకెక్కించగా ఈ సినిమా థియోటర్స్ మూతపడటం వల్ల రిలీజ్ కాకుండా ఆగిపోయింది. ఓటీటీలో రిలీజ్ చేస్తారని ప్రచారం జరిగినా కూడా ఎట్టి పరిస్థితుల్లోను ‘మాస్టర్’ థియోటర్స్ లోనే రిలీజ్ చేస్తామని మేకర్స్ తేల్చి చెప్పారు.

Kamal Haasan unveils teaser of new movie Vikram on his 66th birthday -  entertainment

ఇక ప్రస్తుతం కమల్ తో సినిమా చేసేందుకు లోకేశ్ రెడీ అవుతున్నాడు. ఎప్పుడైతే కమల్ హాసన్ – లోకేష్ కాంబినేషన్ లో సినిమా అని ప్రకటన వచ్చి ప్రీలుక్ అనౌన్స్ అయిందో అప్పటి నుంచే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు మొదలయ్యాయి. కాగా కమల్ బర్త్ డే సందర్భంగా తమిళ, తెలుగు భాషల్లో రూపొందుతున్న ఈ సినిమాకి ‘విక్రమ్’ అన్న టైటిల్ ని ఫిక్స చేసి టీజర్ ని రిలీజ్ చేసి ఫ్యాన్స్ కి పెద్ద సర్‌ప్రైజ్ ఇచ్చారు. ఇక ఈ టీజర్ ని చూస్తే ఈ సినిమాలో కమల్ మాస్ క్యారెక్టర్ లో కనిపించబోతున్నట్టు తెలుస్తోంది.

Vikram: Kamal Haasan and Lokesh Kanagaraj's Version of the 'Last Supper'  Looks Interesting (Watch Video) - Report Door

ఈ సినిమాని కమల్ సొంత నిర్మాణ సంస్థ రాజ్ కమల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్ పై తెరకెక్కబోతుండగా యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ సంగీతమందిస్తున్నాడు. అలాగే క్రియోటివ్ జీనియస్ శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ ‘ఇండియన్ 2’ లో నటిస్తుండగా భారీ బడ్జెట్ తో పాన్ ఇండియన్ సినిమాగా రూపొందబోతుంది.

Kamal Haasan starrer 'Indian 2' not shelved, makers confirm

లాక్ డౌన్ కి ముందు కొంత టాకీ పార్ట్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా..త్వరలో మళ్ళీ మొదలవబోతుందని సమాచారం. అయితే ఇండియన్ 2 లాంటి మరో సినిమా చేయాలన్న ప్లాన్ తోనే లోకేష్ కనకరాజ్ తో విక్రమ్ అన్న తాజా యాక్షన్ ఎంటర్‌టైనర్ ని కమిటయినట్టు కోలీవుడ్ మీడియా సమాచారం.

 


Share

Related posts

Chiranjeevi : చిరంజీవి.. బాలకృష్ణ.. వెంకటేష్.. రవితేజ ..మేలో పెద్ద రచ్చే ..!

GRK

ఇదే జరిగితే టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో మెగస్టార్ తర్వాత మొనగాడు రాం చరణ్ మాత్రమే అంటారు ..?

GRK

Samantha – Nayanatara: సమంత, నయనతారలలో ఎవరు బెస్ట్ ..ఈ దెబ్బతో తేలిపోతుంది..

GRK