Vikram: దిగ్గజ దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన “బాహుబలి 2” అనేక రికార్డులు సృష్టించడం తెలిసిందే. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే అత్యధిక కలెక్షన్స్ సాధించిన సినిమాగా … అనేక ఇండస్ట్రీలలో “బాహుబలి 2″ తిరుగులేని సినిమాగా నిలిచింది. దీంతో చాలా ఇండస్ట్రీలలో నాన్ బాహుబలి రికార్డ్స్ అనే కొత్త పదం తెరపైకి వచ్చింది. ఇదిలా ఉంటే ఇప్పుడు కోలీవుడ్ ఇండస్ట్రీలో.. సెన్సేషనల్ న్యూస్ ఏమిటంటే..”బాహుబలి 2” రికార్డ్స్ “విక్రమ్” సినిమా పాటలు కొట్టింది.
- Read the latest news in Telugu from AP and Telangana’s most trusted news website.
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. పాన్ ఇండియా నేపథ్యంలో రిలీజ్ అయ్యి.. వరుసపెట్టి రికార్డు స్థాయి కలెక్షన్ లు కొల్లగొడుతోంది. బాక్సాఫీస్ వద్ద రికార్డులు మీద రికార్డులు క్రియేట్ చేస్తున్న “విక్రమ్” ఇప్పటికే 300 కోట్ల రూపాయలు కలెక్ట్ చేయగా తాజాగా మరో ఘనత సాధించింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో అత్యధిక కలెక్షన్స్ “బాహుబలి 2” పేరిట (152 కోట్ల రూపాయలు) నిన్నటి వరకు ఉండగా తాజాగా “విక్రమ్” బ్రేక్ చేయడం జరిగింది.
తమిళ సినిమా రంగంలో ఇప్పటి వరకు ఏ సినిమాకి సాధ్యం కాని రీతిలో 16 రోజుల్లోనే ఈ ఫీట్ అందుకోవటం విశేషం. డ్రగ్స్ నేపథ్యంలో కమల్ హాసన్, విజయ్ సేతుపతి, సూర్య, ఫాహద్ ఫాజిల్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటూ.. రికార్డు స్థాయి కలెక్షన్స్ కొల్లగొడుతుంది. ఇంకా ఓవరాల్ రన్ టైంలో మరిన్ని రికార్డులు క్రియేట్ చేయడం గ్యారెంటీ అని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. తెలుగులో కూడా విక్రమ్ భారీ ఎత్తున కలెక్ట్ చేయడం జరిగింది. దాదాపు కొన్ని సంవత్సరాల తర్వాత విలక్షణ నటుడు కమల్ కి హిట్ పడింది.