Kamalpreet Kaur: కమల్ ప్రీత్ ప్రత్యర్థి టోక్యోలో మిగిలిన అథ్లెట్లు కాదు… సామాజిక ఒత్తిడి, మానసిక సంఘర్షణ 

Share

Kamalpreet Kaur: ఎక్కడో చిన్న గ్రామానికి చెందిన కమల్ ప్రీత్ కౌర్ తన రికార్డు బద్దలు కొట్టే పర్ఫార్మెన్స్ తో టోక్యో ఒలింపిక్స్ మహిళల డిస్కస్ త్రో ఈవెంట్లో భారత్ గర్వించే అథ్లెట్ అయింది. తృటిలో పతకం కోల్పోయినప్పటికీ ఆమె ప్రదర్శన కు మాత్రం భారతీయులు సంబరాలు చేసుకున్నారు. 63.70 మీటర్లు విసిరిన kamalpreet ఫైనల్స్ లో ఆరో స్థానంలో నిలిచింది. మొదటిసారి ఒలింపిక్స్లో అడుగుపెట్టిన ఆమె జర్నీ క్లుప్తంగా చూద్దాం…

 

పంజాబ్ లోని ఖబర్ వాలా గ్రామంలో జన్మించిన కమల్ ప్రీత్ తండ్రి ఒక వ్యవసాయదారుడు. తను 5 ఏళ్ల వయసులో ఉన్నప్పుడే క్రీడలు అంటే ఇష్టమని అర్థమైపోతుంది. ముందు క్రికెటర్ కావాలని అనుకున్నప్పటికీ అందుకు సంబంధించిన శిక్షణ తీసుకోవడానికి తన ఊరి లో సరైన వనరులు లేవు. కాబట్టి షాట్ పుట్ తో మొదలుపెట్టిన ఆమె మిగిలిన క్రీడలను కూడా అదే ఆసక్తితో ఆడ సాగింది. 

చదవకపోతే పెళ్లే…!

ఇక ఆ రోజుల్లో గ్రామాల్లో ఆడపిల్లలకు తక్కువ వయసులోనే పెళ్లి చేసేవారు. వీరు కనుక చదువుకుని మంచి కాలేజీ స్థాయికి వెళ్లకపోతే కూడా తన తలరాత కూడా అంతే అన్న విషయం కమల్ ప్రీత్ కి తెలియంది కాదు. కాబట్టి ఆమె కసి తో ఈ ఫీల్డ్ లోకి అడుగుపెట్టింది. స్కూల్ రోజుల్లో ఆమె పీ.ఈ.టి తన ప్రతిభ ను గుర్తించాడు. ఆయన సహకారంతో రాష్ట్ర స్థాయి పోటీల్లో నాలుగో స్థానంలో నిలిచింది. 

Kamalpreet Kaur: SAI లో తిరస్కరణ

ఇక కమల్ ప్రీత్ తండ్రి అతని పంట పత్రాలను తాకట్టుపెట్టి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (SAI) లో చేర్పించాడు. కానీ ఎస్.ఏ.ఐ హాస్టల్ మాత్రం ఆమె అప్లికేషన్ తిరస్కరించింది. ఇక్కడ ఉండే సదుపాయాలు తాను క్రీడాకారిణి అవ్వడానికి అవసరమయ్యే పోషక ఆహారాన్ని ఇవ్వలేకపోయాయి. అయితే ఆమె అడ్మిషన్ కే ఎంతో ఖర్చు చేసింది కాబట్టి ఇంటి నుండి తయారు చేసుకున్న, తెచ్చుకున్న సామగ్రితోనే ట్రైనింగ్ మొదలుపెట్టింది. 

తన చదువు పూర్తి అయిన తర్వాత ఇండియన్ రైల్వేస్ లో ఉద్యోగం సంపాదించింది. ఇక ఆ సహకారంతో మిగిలిన ట్రైనింగ్ తీసుకుంది. 2016 జాతీయ జూనియర్ ఛాంపియన్షిప్ U-20, U-18 పోటీల్లో జాతీయ చాంపియన్ గా నిలిచింది. 2017 ప్రపంచ యూనివర్సిటీ గేమ్స్ ద్వారా మొట్టమొదటిసారిగా అంతర్జాతీయ స్థాయిలో ఆడింది. 

Kamalpreet Kaur: డైట్ ని ఎక్కడా వదలలేదు..! 

బయట దేశాలకు వెళ్లేటప్పుడు భారతదేశంలో లాగా పూర్తి శాఖాహార భోజనం అందుబాటులో ఉండదు అని తనకి తెలుసు. కానీ ఒక అథ్లెట్ కి భోజనం ఎంత అవసరమో కూడా తెలుసు. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని తన ఆహారాన్ని తానే తీసుకెళ్ళేది. ప్రోటీన్ శాతం కూరగాయలు ఎక్కడా తగ్గకుండా చూసుకునేది. టోక్యో ఒలింపిక్స్ క్వాలిఫైయింగ్ రౌండ్ లో తన పర్సనల్ బెస్ట్ 65.06m డిస్క్ ని విసిరి రెండో స్థానంలో నిలిచి అందరినీ అబ్బుర పరిచింది. ఇక అప్పటి నుండి ఆమె వెనుదిరిగి చూడలేదు… ఇక చూడదు కూడా…!


Share

Related posts

ఇది కూడా ఇంతకముందు వచ్చిన టైటిలే కదా ..?

GRK

లాక్ డౌన్ ఎత్తివేత దశల వారీగా ఏప్రిల్ 14 నుంచి

Siva Prasad

Weight Gain: సన్నగా ఉన్నవారు 7రోజుల్లో బరువు పెరగడండి.. అద్భుతమైన చిట్కా..!!

bharani jella