NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Kanaka Durga Temple : కనకదుర్గమ్మ కళ్ళే కప్పేశారు!అక్రమాలకు నిలయంగా మారిన ఆలయం !నిగ్గుదేల్చిన ఏసీబీ !!

Kanaka Durga Temple : ఇంద్రకీలాద్రిలో ఇంటి దొంగలపై ఏసీబీ ఫోకస్‌ చేసింది. అమ్మవారి సొమ్మును అడ్డంగా దోచుకున్న అధికారుల లిస్ట్‌ రెడీ చేసింది. మూడ్రోజుల సోదాల్లో నాలుగేళ్ల ఫైల్స్‌ను తవ్వి తీసిన ఏసీబీ టీమ్స్‌… గత పాలకమండలి హయాంలో వచ్చిన ఆరోపణలపైనా రిపోర్ట్‌ రెడీ చేసింది. దుర్గ గుడిలో అక్రమాల్ని ఏసీబీ అధికారులు తవ్వితీశారు. మూడ్రోజులపాటు అన్ని విభాగాల్లో సోదాలు నిర్వహించి… అధికారుల అవినీతిపై కీలక సమాచారం రాబట్టారు.

Kanaka durga blindfolded! The temple has become home to irregularities! ACB shocked !!
Kanaka durga blindfolded! The temple has become home to irregularities! ACB shocked !!

Kanaka Durga Temple : రట్టు అయిన అక్రమాల గుట్టు!

ప్రస్తుత పాలకమండలి హయాంలో జరుగుతున్న పనులపైనే కాకుండా.. గత నాలుగేళ్ల ఫైళ్లను పరిశీలించారు. గత పాలకమండలి హయాంలో భారీగా అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు రావడంతో… అప్పట్లో జరిగిన అన్ని పనులకు సంబంధించిన ఫైళ్లను తవ్వి తీశారు. కొండపై అభివృద్ధి పనులు, ఇంజినీరింగ్‌, టెండర్ల పనుల డేటా సేకరించారు.

పక్కా సమాచారంతో రంగంలోకి ఏసీబీ!

ఇంద్రకీలాద్రిపై అసలేం జరుగుతోంది? గతంలో ఎన్నడూ లేనివిధంగా ఏసీబీ సోదాలు మూడ్రోజులపాటు ఎందుకు సాగాయి? బెజవాడలో ఇప్పుడివే ప్రశ్నలు అందర్నీ తొలిచివేస్తున్నాయి. గతంలోనూ విజిలెన్స్‌, ఏసీబీ సోదాలు నిర్వహించినా.. ఇంత సుదీర్ఘంగా ఎన్నడూ జరగలేదని చెబుతున్నాయి దుర్గగుడి వర్గాలు. పక్కా సమాచారంతోనే రంగంలోకి ఏసీబీ అధికారులు దిగారని తెలుస్తోంది. రెండు కోట్ల రూపాయల విలువ చేసే స్క్రాప్‌ను కేవలం 40 లక్షలకే విక్రయించినట్లు గుర్తించారు.శానిటేషన్‌, సెక్యూరిటీ సిబ్బంది టెండర్ల విషయంలో భారీగా అక్రమాలు జరిగినట్లు తేల్చాయి తేల్చారు. లడ్డూ ప్రసాదాలు, టిక్కెట్, చీరల కౌంటర్లతో పాటు టోల్ గేట్, కేశ ఖండనశాల, ప్రొవిజన్ స్టోర్, ఇంజనీరింగ్ విభాగాల్లో… ఏ ఫైల్‌ తీసినా అవినీతిమయమైనట్లు ఏసీబీ టీమ్స్‌ నిర్ధారించాయి.

ఈవో సురేష్ బాబుపై అనుమానాలు!

ఈ స్థాయిలో అక్రమాలు సాగుతున్నా ఈవో సురేశ్‌బాబు ఎందుకు పట్టించుకోవడాన్ని ఏసీబీ అనుమానిస్తోంది.దేవస్థానంలో ఏ పనిచేసినా.. వాటికి సంబంధించిన ఫైళ్లను ఈవో పరిశీలించాకే అప్రూవ్‌ చేయాలి. కానీ.. ఇంద్రకీలాద్రిపై ఇలాంటి రూల్స్‌ పాటించట్లేదని ఏసీబీ తేల్చింది. ఇప్పటిదాకా బయటపడ్డ అవినీతిపై ప్రశ్నిస్తే… ఈవో సురేశ్‌బాబు సమాధానాలివ్వకుండా… దాటేస్తున్నట్లు తెలుస్తోంది. మూడ్రోజులుగా ఇదే తంతు సాగడంతో ఏసీబీ అధికారులు అసహనానికి గురైనట్లు సమాచారం. ఇక- మూడ్రోజులుగా అవినీతి ఫైళ్లను తవ్వి తీసిన అధికారులు… ప్రతి విభాగంలోనూ అక్రమాలు జరిగినట్లు తేల్చారు. వీటిపై త్వరలోనే ఉన్నతాధికారులకు రిపోర్ట్‌ పంపించేందుకు రెడీ అవుతున్నారు.

 

author avatar
Yandamuri

Related posts

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju